Alert To Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ చేసింది. సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి..
విద్యా, వైద్య రంగాలపైనే అత్యధికంగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక ఇకపై ఒక లెక్క అన్న మాదిరిగా.. పూర్తి మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు.
ఇప్పటికే అనేక మార్పులు తీసుకువచ్చేందుకు ఏపీ సర్కార్ అడుగులు వేసింది.. వేస్తూనే ఉంది. నాడు - నేడు పథకం కింద పాఠశాలల రూపురేఖలను మారుస్తోంది. మరోవైపు విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా సర్కార్... మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ తరగతి వరకు రెండు సెమిస్టర్ల విధానాన్ని తీసుకురానున్నారు. 2024-25 నుంచి పదో తరగతిలోనూ సెమిస్టర్ విధానం అమలు చేయనున్నట్లు ఏపీ సర్కార్ పేర్కొంది.
అందుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను కూడా జగనన్న విద్యా కానుక ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ఆర్జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
0 Comments:
Post a Comment