Abha Health Card - సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న అభ హెల్త్ కార్డు ప్రయోజనాలు ఇవే.. ఇలా అప్లై చేసుకోండి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్(Abha Card-అభ కార్డు) హెల్త్ ఐడీగా ప్రజలకు ఉపయోగపడుతోంది. ఈ కార్డును పొందడం ద్వారా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందుకోవచ్చు.
అభ కార్డు అనేది ఫోన్ నంబర్ లింక్డ్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా జనరేట్ అయ్యే 14 అంకెల స్పెషల్ హెల్త్ ఐడీ. ఈ ఐడీని పొందిన సామాన్య ప్రజలు తమ ఆరోగ్య రికార్డులను బీమా కంపెనీలు, హాస్పిటల్స్, క్లినిక్లతో డిజిటల్గా పంచుకోవచ్చు. ABHA కార్డు వల్ల డాక్యుమెంట్స్ చేత పట్టుకొని తిరగాల్సిన అవసరం రాదు. అలాగే అవి పోతాయని భయ పడాల్సిన పనిలేదు. మెడికల్ రిపోర్టులను అభ కార్డు ఎల్లప్పుడూ కాపాడుతుంది.
అభ కార్డు కోసం ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటే.. మొదటగా https://healthid.ndhm.gov.in/register వెబ్సైట్కు వెళ్లాలి. ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్స్ లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ప్రూఫ్ ఐడీ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ సెలెక్ట్ చేసుకున్నవారు తమ ఆధార్ కార్డు మొబైల్తో లింక్ అయినట్లు నిర్ధారించుకోవాలి. ఆపై 'ఐ అగ్రీ' అనే ట్యాబ్పై క్లిక్ చేసి మన దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
అనంతరం ఫోన్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఆపై న్యూ కొత్త పేజీ ఓపెన్ అయ్యాక అందులో కనిపించిన డీటెయిల్స్ సరి చూసుకోవాలి. తర్వాత సబ్మిట్ చేశాక ఓపెన్ అయ్యే కొత్త పేజీలో సరికొత్త హెల్త్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆపై ఫొటోతో ఉన్న ABHA కార్డును డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
0 Comments:
Post a Comment