Aam Aadmi Party: జాతీయ పార్టీగా ఆప్.. క్రేజీగా కేజ్రీవాల్ పార్టీ!
Aam Aadmi Party: మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది.. ఈ సినిమా పాటలో ఎంతో మందికి ఇన్‌స్ప్రేషన్..
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పొడు.. అత్తారింటికి దారేది సినిమాలోని ఈ డైలాగ్ కూడా చాలామందిని ప్రభావితం చేసింది.
Aam Aadmi Party
ఈరెండూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అచ్చంగా సరిపోతాయి. సామాన్యుడిలా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కేజ్రీవాల్.. వినూత్నంగా తన పార్టీ గుర్తు కూడా చీపును ఎంచుకున్న కేజ్రీవాల్ తన పని తానుచేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండుసార్లు అధికారంలోకి వచ్చాడు. ఏడాది క్రితం పంజాబ్‌లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్రమోదీని ఆయన సొంతరాష్ట్రంలో ఢీకొట్టేందుకు కూడా వెనుకాడలేదు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రపదేశ్ ఎన్నికల్లో పోటీచేసి అధికారం దక్కించుకోకపోయినా.. ప్రజల అభిమానం చూరగొన్నారు. రాజకీయంగా మోదీతో ఢీ అంటే ఢీ అంటూనే అభివృద్ధి విషయంలో మాత్రం ప్రధాని, కేంద్రం సాయం అడగడానికి మొహమాట పడడం లేదు. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఆప్ జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతోంది.
కీలంగా ఆ రెండు రాష్ట్రాల ఓట్లు..
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆప్‌కు చాలా కీలంగా మారాయి. ఈ రాష్ట్రాల్లో విజయం సంగతి పక్కన పెడితే.. రెండింటిలో ఏ ఒక్క రాష్ట్రంలో 6 శాతం ఓట్లు వచ్చినా ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందనుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది. అయితే ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్.. ఈ మధ్యే గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి రికార్డు çసృష్టించింది. ఇప్పుడు గుజరాత్ లో లేదా హిమాచల్ లో ఏదో ఒక చోట 6 శాతం ఓట్లు దాటితే ఆప్ జాతీయ పార్టీకి అర్హత సాధిస్తుంది. గుజరాత్ లో కనీసం రెండు సీట్లు గెలిచినా ఆప్ కల నెరవేరినట్టే. ప్రస్తుతం వస్తున్న ఆధిక్యం చూస్తుంటే.. ఆప్ ఎనిమిదిఇ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అదే గనక జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిదో జాతీయ పార్టీగా నిలవనుంది. దీంతో ఈవీఎం మెషీన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్ మొదటి స్థానంలోకి రానుంది.
రెండేళ్ల క్రితం సూరత్‌లో 28 శాతం ఓట్లు..
2021లో సూరత్ మున్సిపల్ ఎన్నికలలో 28% ఓట్ల వాటాను సాధించి కాంగ్రెస్ స్థానంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించింది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా గుజరాత్, హిమాచల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శనను చూపిస్తామని ఆప్ ఇప్పటికే విశ్వాసం వ్యక్తం చేసింది.
జాతీయ పార్టీ హోదాలో 2024 లోక్‌సభ ఎన్నికలకు..
2024 ఎన్నికలకు జాతీయ పార్టీ హోదాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఆప్‌కి ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఇప్పటివరకు బీజేపీ లీడింగ్‌లో ఉండగా, ఆప్ 7 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. హిమాచల్ లో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది.
Aam Aadmi Party
జాతీయ పార్టీ అర్హతలివీ..
అక్టోబర్ 5న దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు తెలంగాణన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్బాటంగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ఇలా హంగు ఆర్బాటాలు చేయకుండా తన పనితీరుతో ఎదుగుతున్నారు.. అయితే జాతీయ పార్టీ స్థాపించడానికి పార్టీలకు కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు ? అన్న విషయానికొస్తే…
మన దేశంలో బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ అమల్లో ఉంది. అంటే ఎన్ని పార్టీలైనా దేశంలో ఉండొచ్చు. అలాగే, ఈ పార్టీలను జాతీయ, ప్రాంతీయ పార్టీలు అనే రెండు రకాలుగా విభజించారు.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే...
కేంద్ర ఎన్నికల సంఘం 1968 ప్రకారం.. చివరి సారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి.
ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి.
ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.
కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
టీఆర్‌ఎస్ పార్టీ ఇవేవీ సాధించలేదు. కానీ ఆ పార్టీ నాయకులు తమది జాతీయ పార్టీ అని, బీఆర్‌ఎస్ ప్రకటనతో ప్రధాని నరేంద్రమోదీ వణుకు మొదలైందని ప్రచారం చేసుకుంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ ఇలా ఎక్కడా ప్రకటించడం లేదు. సైలెంటగా తమపని తాము చేసుకుంటూ పోతుండగా, ఫలితాలు దానంతటవే వారికి అనుకూలంగా వస్తున్నాయి. మరి ఇప్పటికైనా టీఆర్‌ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలుగుతుందో చూడాలి.
0 Comments:
Post a Comment