రాష్ట్రంలో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ : పార్లమెంటులో కేంద్రం వెల్లడి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
రాజ్యసభలో ఆమాద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ అడిగిన ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22లో ఏపిలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలో ఉనుత విద్యా సంస్థల్లో 3,753 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైసిపి ఎంపి ఆర్ కఅష్ణయ్య అడిగిన మరో ప్రశుకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సమాధానం ఇచ్చారు.
అక్రమ మైనింగ్‌లో మూడో స్థానం
అక్రమ మైనింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. లోక్‌సభలో ఒక ఎంపి అడిగిన ప్రశుకు కేంద్ర గనుల మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. 2021-22లో ఏపిలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి 9,351 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 3,396 వాహనాలు సీజ్ చేసినట్లు, రూ.420.91 కోట్ల జరిమానా రాష్ట్ర ప్రభుత్వం విధించిందని పేర్కొన్నారు. కోర్టుల్లో 24 కేసులు దాఖలు అయ్యాయని, 39 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణలో 2,831 కేసులు నమోదు కాగా, 73 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమ మైనింగ్‌లో ఉత్తరప్రదేశ్ (23,787), మధ్యప్రదేశ్ (9,361) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
నత్తనడకన రైల్వే ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌లో 31 రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. వైసిపి ఎంపి పోచా బ్రహ్మానంద రెడ్డి అడిగిన ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 31 ప్రాజెక్టుల్లో 16 ప్రాజెక్టులు కొత్త లైన్లు కాగా, 15 ప్రాజెక్టులు డబుల్ లైన్లవని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులు రూ.70,594 కోట్ల వ్యయంతో 5,581 కిలో మీటర్ల పొడువు ఉంటాయని అన్నారు.
0 Comments:
Post a Comment