విశాఖ వాసులకు గుడ్‌న్యూస్.. 5జీ సర్వీసులు ప్రారంభం.
విశాఖపట్నం : దేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ వైజాగ్‌లో అత్యాధునిక 5జీ ప్లస్ సేవలను గురువారం నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది.
సంస్థ తన 5జీ నెట్‌వర్క్‌ని దశలవారీగా విశాఖ నగరంలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్ భార్గవ వెల్లడించారు.
5జీ నెట్‌వర్క్‌ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేంత వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ని ఉచితంగా పొందవచ్చని సీఈవో శివన్ వివరించారు. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్ సిమ్‌తోనే 5జీ సేవల్ని 5జీ ఫోన్‌లో పొందేలా వినియోగదారులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
0 Comments:
Post a Comment