ప్రశ్నపత్రాల ముద్రణ ఖర్చు రూ.40 లక్షలు వృథా
విద్యాశాఖలో ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాల ఆధారంగా ఉపాధ్యాయులు బోధన నిర్వహించగా.. ఇప్పుడు బైజూస్ కంటెంట్‌తో ప్రశ్నపత్రాలు ఇస్తామని ప్రకటించడం గందరగోళానికి తావిస్తోంది.
బైజూస్ కంటెంట్‌పై ట్యాబ్‌లలోనే పరీక్ష?
నెలాఖరు వరకు ట్యాబ్‌ల పంపిణీ
ప్రశ్నపత్రాల ముద్రణ ఖర్చు రూ.40 లక్షలు వృథా
ఈనాడు, అమరావతి: విద్యాశాఖలో ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాల ఆధారంగా ఉపాధ్యాయులు బోధన నిర్వహించగా.. ఇప్పుడు బైజూస్ కంటెంట్‌తో ప్రశ్నపత్రాలు ఇస్తామని ప్రకటించడం గందరగోళానికి తావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి 10 వరకు సమ్మెటివ్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి 9.2 లక్షల ప్రశ్నపత్రాలను ముందుగానే ముద్రించారు. ఇప్పుడు బైజూస్ కంటెంట్‌తో ప్రశ్నపత్రాలు ఇవ్వనుండటంతో ఆ ప్రశ్నపత్రాలు, వాటికి పెట్టిన రూ.40 లక్షల ఖర్చు వృథా కానుంది. మరోవైపు బైజూస్ కంటెంట్ ప్రశ్నపత్రాలను ముద్రించి ఇస్తారా? లేక ట్యాబ్‌ల్లోనే పరీక్షలు నిర్వహించాలా అనేదానిపై తమకు స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రైవేటు బడుల్లో విద్యార్థులకు మాత్రం ముందుగా ముద్రించిన ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహిస్తారు.
ఇప్పుడే ట్యాబ్‌లు ఇచ్చి.. అప్పుడే పరీక్షలా?
ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ఈ నెల 21న ప్రారంభించారు. వారం రోజులపాటు సరఫరా జరుగుతుందని ప్రభుత్వమే ప్రకటించింది. అంటే ఈ నెలాఖరుకు గానీ పూర్తిస్థాయిలో అందే పరిస్థితి లేదు. బైజూస్ కంటెంట్‌పై సాధన చేయకుండానే దాని ఆధారంగా పరీక్షల నిర్వహణకు అధికారులు సిద్ధమవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే బోధనకు, బైజూస్ కంటెంట్ వీడియో పాఠాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు వీటినే ఎస్‌ఏ1 పరీక్షలు వినియోగించేందుకు సిద్ధమయ్యారు. ఎనిమిదో తరగతికి విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ పుస్తకాలను అందించారు. బైజూస్, తరగతిలో చెప్పిన సిలబస్ ఒక్కటే అయినా బోధన, ప్రశ్నల సరళిలో చాలా తేడాలుంటాయి. ఇప్పుడు బైజూస్ కంటెంట్‌తో పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులపై ప్రయోగాలు చేస్తున్నారని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లోకి బైజూస్ పాఠాలను తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు పరీక్షలకు ఆ సంస్థ ప్రశ్నలనే తీసుకుంటోంది. జనవరి 10వ తేదీతో సమ్మెటివ్-1 పరీక్షలు పూర్తికాగానే 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. 17 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆ తర్వాత ముందుగా ముద్రించిన ప్రశ్నపత్రాలను వినియోగించుకోవాలని విద్యాశాఖ సూచించడం గమనార్హం.
0 Comments:
Post a Comment