✍️ డిజి లాకర్‌లో పదో తరగతి మెమోలు
♦️2017 నుంచి 2022 వరకు అందుబాటులోకి
*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి మార్కుల మెమోలను డిజిలాకర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 2017 నుంచి 2022 వరకు చదివిన అభ్యర్థుల మార్కుల మెమోలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల ధ్రువపత్రాల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ విధానాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షల విభాగాలను.. మార్కుల జాబితాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం మొట్టమొదటగా పదో తరగతి మెమోలను వెబ్‌సైట్‌లో పెట్టింది. త్వరలో 2004 నుంచి ఉన్న డేటాను అప్‌లోడ్ చేయనున్నారు. అభ్యర్థులు ఎవరైనా తమ మెమోలను పోగొట్టుకుంటే డిజి లాకర్‌లోకి వెళ్లి పొందవచ్చు. ఆధార్ నంబరు నమోదు చేసి, సర్టిఫికెట్‌ను పీడీఎఫ్ రూపంలో పొందొచ్చని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఆధార్ కార్డులోని పేరు, సర్టిఫికెట్‌లోని పేరు ఒకేలా ఉంటేనే ఈ సాధ్యమవుతుందని వెల్లడించారు.
0 Comments:
Post a Comment