10th Exams - Director Devananda Reddy Meeting -
ఈరోజు గవర్నమెంట్ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానందరెడ్డి గారితో జరిగిన జూమ్ మీటింగ్ విశేషాలు.
🌷CBSE Pattern ఇంప్లిమెంట్ చేసే విధానం లో భాగంగా ఈ సంవత్సరం నుండి 10వ తరగతిలో 6పేపర్లు ఉంటాయి.
🌷PS లో 16 ప్రశ్నలు, NS లో 17 ప్రశ్నలు ఇస్తారు. ముందు PS వ్రాయాలి. తరువాత NS వ్రాయాలి.
🌷రోజు మార్చి రోజు (Day by day) పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతికై ప్రొసీడింగ్స్ పెట్టి ఉన్నారు.
🌷ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన NR కానీ, అప్లికేషన్స్ కానీ ప్రామాణికంగా తీసుకుంటారు.
🌷MNR అనేది future evidence కోసం ఆఫీస్ లో రికార్డ్ మెయింటైన్ చేయడం కోసం కావాలి కాబట్టి ఖఛ్చితంగా నామినల్ రోల్ పంపాలి.
🌷నామినల్ రోల్స్, పోస్ట్ ద్వారా గానీ, టపాల్స్ ద్వారా గానీ DEO ఆఫీస్ కి పంపొచ్చు. DCEB కి ఎగ్జామ్ ఫీజ్ కట్టిన రసీదు సబ్మిట్ చేయాల్సిన పని లేదు. Dy. EO కౌంటర్ సైన్ అవసరం లేదు.
🌷CFMS ద్వారా 10th పరీక్ష ఫీజు ఎవరైనా కట్టినచో అవి కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
🌷ఎవరైనా స్టూడెంట్ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వివరాలను తప్పుగా నమోదు చేసి ఉంటే కంగారు పడవద్దు. రాష్ట్రం లోని అందరూ పబ్లిక్ పరీక్షల ఫీజులను చెల్లించిన తరువాత EDIT ఆప్షన్ ఇస్తామని గౌరవ దేవేందర్ రెడ్డి గారు తెలియజేసారు.
0 Comments:
Post a Comment