WhatsApp మరో అద్భుత ఫీచర్: కంపానియన్ మోడ్, అంటే ఏంటంటే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.
ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లతోపాటు, మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్‌కి యూజర్లకు అనుమతినివ్వనుంది. ఈ సేవను ఎనేబుల్ చేసేలా 'కంపానియన్ మోడ్' అనే ఫీచర్‌ని పరీక్షిస్తోంది.
వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వాబేటా ఇన్ఫో ప్రకారం కంపానియన్ మోడ్ ఫీచర్‌ను కొన్ని బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. కొంతమంది బీటా టెస్టర్ల కోసం ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాద మొబైల్, డెస్క్‌టాప్‌లో ఏకకాలంలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చని తెలిపింది. 'లింక్ డివైస్' ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ అందిస్తుంది. మరొక స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసిన తర్వాత, చాట్ హిస్టరీ చూడటం తోపాటు, మెసేజేస్ చూసుకోవడం, సమాధానాలివ్వడంతోపాటు కాల్స్‌ను చేసుకోవచ్చు. బీటా టెస్టర్ గరిష్టంగా 4 పరికరాలను రెండు స్మార్ట్‌ఫోన్‌లు, ఒక టాబ్లెట్ ,ఒక డెస్క్‌టాప్‌కి లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డెస్క్‌టాప్‌లో వాట్సాప్ సేవలను పొందుతున్న సంగతి తెలిసిందే.
కాగా వాట్సాప్‌కు భారతదేశంలో దాదాపు 500 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.ఇటీవల గ్రూప్‌లో పాల్గొనే వారి సంఖ్యను 1024కి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒక గ్రూపు పలు గ్రూపులను రూపొందించడానికి యూజర్లకు అనుమతిస్తుంది. ఇందులో ఒక గ్రూపు గరిష్టంగా 12 గ్రూపులను క్రియేట్ చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment