WhatsApp ప్రతీ వాట్సాప్ గ్రూపునకు కూడా 10 డాలర్లు పెడితే!?
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను టెస్లా చీఫ్ కొనుగోలు చేసిన తరువాత సోషల్ మీడియాలో సెటైర్లు ఒక రేంజ్‌లో పేలుతున్నాయి.
మెటా సొంతమైనవాట్సాప్‌ను కూడా కొనుగోలు చేసి, వాట్సాప్ గ్రూపులకు కూడా ఫీజు పెడితే బావుంటుందంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ''ఎలాన్ మస్క్ దయచేసి వాట్సాప్‌ను కొనుగోలు చేసి, 10 డీలర్లు ఫీజు పెట్టండి.. డాలర్లే డాలర్లు'' అంటూ హాయ్ హైదారాబాద్ అనే ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్ల రియాక్షన్స్, మీమ్స్ అదిరిపోతున్నాయి.
వుండండి బ్రో..మీరు లేనిపోని సలహాలు ఇవ్వకండి. నేను అంత రిచ్ కాదు ఒకరు కమెంట్ చేయగా, ఆ పనిచేయాలి పీడా పోద్ది, ఫ్యామిలీ గ్రూపు, ఆఫీసు గ్రూపు, ఫ్రెండ్స్ గ్రూపు, టెన్త్ గ్రూపు, ఇంటర్ గ్రూపు, అసోసియేషన్ గ్రూపు అబ్బో..ఈ గ్రూపులతో చచ్చిపోతున్నాం అని ఇంకొకరు వ్యాఖ్యానించారు అంతేకాదు 55 శాతం ట్విటర్ ఉద్యోగులను తొలగించారు.. ఇక మస్క్ వాట్సాప్‌ను కొంటే..వాట్సాప్ యూనివర్శిటీ స్టూడెంట్లు అందరినీ సస్పెండ్ చేస్తారేమో అంటూ మరొకరు, స్పామ్ మెసేజ్‌ల గోల ఉండదు అని ఇంకొకరు ట్వీట్ చేయడం విశేషం.
0 Comments:
Post a Comment