తెలంగాణలోని మునుగోడుకి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలతో పాటు దేశంలోని కొన్ని చోట్ల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇదే రోజు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా జరుగుతున్నది.
ఇక్కడ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన భార్య రుతుజా లట్కేని ఉద్దవ్ థాకరే వర్గం శివసేన అభ్యర్ధిగా నిలబెట్టింది.
అంతకుముందు ఈ స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్ధిగా మజీతియాని బరిలోకి దింపగా, ఆమెకు ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన మద్దతు తెలిపింది.
అయితే చివరి నిమిషంలో బీజేపీ బరి నుంచి తప్పుకోవడంతో రుతుజా లట్కే విజయం ఏకపక్షంగా మారింది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
రుతుజా లట్కేకు 66,247 ఓట్లు రాగా, రెండో స్థానంలో అనూహ్యంగా 12,776 ఓట్లతో నోటా కొనసాగుతోంది.
అంటే రుతుజా తన సమీప ప్రత్యర్ధి నోటాపై 54 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యంతో కొనసాగుతున్నది.
మిగతా అభ్యర్ధులెవరికీ కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. కాగా, మునుగోడులో టీఆర్ఎస్ బీజేపీ కంటే వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉంది.
0 Comments:
Post a Comment