పెళ్లి అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను కలిపే ఓ బంధం కూడా.. మన దేశంలో పెళ్లిళ్లు చాలా ఘనంగా జరుగుతాయి. సంగీత్ లు, బారత్ లతో ధూమ్ ధామ్ గా జరుపుకుంటారు.
కొన్ని పెళ్లిళ్లు అయితే రెండు మూడు రోజులు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఇక పెళ్లిళ్లలో జరిగే సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా ఓ పెళ్లి కూడా వైరల్ అవుతుంది. పెళ్లి పత్రిక చూడగానే అంతా షాక్ ఇంతకు అందరు ఎందుకు షాక్ అవుతున్నారంటే.. ఇక్కడ పెళ్లి జరుగుతుంది మనుషులకు కాదు.
గురుగ్రామ్‌లోని పాలం విహార్‌లోని జిలే సింగ్ కాలనీలో షేరు అనే వరుడు స్వీటీ అనే వధువును వివాహం చేసుకున్నాడు. భారతీయ వివాహ సంప్రదాయాల ప్రకారం వివాహం ఘనంగా ఆచారాలకు తగ్గట్టు తల్లిదండ్రులు నిర్వహించారు.
ఇరుగుపొరుగు వారందరూ ప్రేమగా ఆనందంతో పెళ్లిలో పాల్గొన్నారు. వరుడి తల్లి స్వయంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు. అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా..? షేరు-స్వీటీ అంటే మనుషులు కాదు కుక్కలు.
స్వీటీ తల్లి సవిత మాట్లాడుతూ.. 'నా భర్త గుడి సమీపంలోని కుక్కలకు నిత్యం ఆహారం ఇచ్చేవాడు. ఒకరోజు అతను ఇంటికి వస్తుండగా ఒక కుక్క అతనిని అనుసరించింది. ఎలాగూ మాకు పిల్లలు లేరు. అప్పటి నుంచి ఆ కుక్క స్వీటీ మా కూతురైంది.
స్వీటీకి పెళ్లి చేయాలనుకున్నారు. పక్క ఇంట్లో షేరు అనే మగ కుక్క ఉండేది. తల్లిదండ్రులకు పెళ్లి ప్రపోజ్ చేయగా అందుకు వాళ్ళు అంగీకరించారు. చివరకు నాలుగు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు చేశాం అని తెలిపింది.
అలాగే 'ఈ పెళ్లి చేసినందుకు పోలీసులు మమ్మల్ని జైలుకు తీసుకెళ్తారని కొందరు అన్నారు. కానీ అలాంటి సమస్యే రాలేదు. మాకు పిల్లలు లేరు. మా ఆనందానికి మూలం స్వీటీ. స్వీటీ పెళ్లి విషయంలో మేం కూడా సంతోషంగా ఉన్నాం అని చెప్పుకొచ్చింది.
వరుడు షేరు తల్లి మణిత మాట్లాడుతూ 'షేరు మాతో కలిసి జీవించడం ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతోంది. అతను మా కొడుకు లాంటి వాడు. స్వీటీతో పెళ్లి ప్రపోజల్ రావడంతో ఒప్పుకున్నాం.
అందరితో కలిసి ఆనందంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం సంప్రదాయ పద్ధతిలో పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం.
ఈ పెళ్లికి 100 మందిని ఆహ్వానించారు. 25 పెళ్లి పత్రికలను కూడా ముద్రించిన ఆహ్వానాలు ,ఆన్‌లైన్ ఆహ్వానాలు కూడా పంపారు. ఈ వివాహాన్ని ఇరుగుపొరుగున కొందరు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించారు.
కానీ కుక్క తల్లిదండ్రులుగా, ఇతరుల అభిప్రాయం మాకు ముఖ్యం కాదు. అనుకున్నది చేశామని సంతోషిస్తున్నాం అని అన్నారు.
0 Comments:
Post a Comment