Viral News - ఒంటి నిండా రోమాలు.. తోడేలును తలపించేలా ముఖం. మధ్యప్రదేశ్ యువకుడికి అత్యంత అరుదైన వ్యాధి
ఒళ్లంతా వెంట్రుకలు.. ముఖాన్ని కప్పేసేలా రోమాలు..
చూడగానే భయం కలిగించే తోడేలు లాంటి రూపం.. అత్యంత అరుదుగా వచ్చే వేర్‌ఉల్ఫ్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలివి. మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలోని నంద్లేటా గ్రామానికి చెందిన లలిత్ పాటిదార్ అనే 17 ఏళ్ల యువకుడు ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. తల నుంచి కాలిగోటి వరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నాడు.
ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఈ వ్యాధి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సిండ్రోమ్ ఉన్నవారికి ఒళ్లంతా వెంట్రుకలు పెరుగుతాయి. ఎన్నిసార్లు కత్తిరించినా మళ్లీ వెంట్రుకలు వస్తుంటాయి. లలిత్ పుట్టినప్పుడే ఒళ్లంతా వెంట్రుకలు ఉండేవి.
సాధారణ రోమాలే అనుకొన్న వైద్యులు.. అప్పుడే వాటిని తొలగించారు. కానీ ఏడేళ్లు వచ్చేసరికి లలిత్ శరీరం అంతా వెంట్రుకలు పెరిగాయి. అతడి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా వేర్‌వుల్ఫ్ సిండ్రోమ్ వ్యాధి ఉందని తెలిసింది. మొదట్లో తన రూపం చూసి పిల్లలు భయపడేవారని, రాళ్లతో కొట్టేవారని లలిత్ చెప్పాడు. ఈ వ్యాధికి చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment