అమ్మానాన్నను ఒకే జిల్లాలో వేయండి
'మా అమ్మానాన్నలు దూరంగా ఉండటం వల్ల చదువుకోలేకపోతున్నాం. ఇద్దర్నీ ఒకే జిల్లాకు బదిలీ చేయాలి' అంటూ పలువురు ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వేర్వేరు ప్రాంతాల్లో విధులతోచదువుకోలేకపోతున్నాం
ప్రభుత్వానికి పలువురు ఉపాధ్యాయుల బిడ్డల విజ్ఞప్తి
ఖైరతాబాద్, నవంబర్ 14 : 'మా అమ్మానాన్నలు దూరంగా ఉండటం వల్ల చదువుకోలేకపోతున్నాం. ఇద్దర్నీ ఒకే జిల్లాకు బదిలీ చేయాలి' అంటూ పలువురు ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ పిల్లలతో కలిసి వచ్చిన పలువురు ఉపాధ్యాయురాళ్లు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన 1655 మెమో ద్వారా భర్త పనిచేసే చోటే భార్యకు పోస్టింగ్ ఇవ్వాలని, కానీ, కొందరు అధికారుల చర్యల వల్ల భార్యభర్తలు విడివిడిగా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోయారు.
13 జిల్లాల్లో అనేక పోస్టులున్నా అధికారులు రిక్రూట్‌మెంట్, ఇతర కారణాలు చెబుతున్నారని తెలిపారు. అనేక మంది మహిళా ఉద్యోగులకు శిశువు నుంచి ఐదేండ్ల వయసు పిల్లలు ఉన్నారని,భార్యాభర్తలు వేర్వేరుగా పనిచేయడం వల్ల వారి ఆలనా, పాలనా చూడటం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి స్పౌజ్ సమస్యను తీర్చాలని కోరారు. సమావేశంలో సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన విజయలక్ష్మి, శిరీష, శ్రీలక్ష్మి, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment