Transfers - బదిలీలు ఉన్నట్లా ? లేనట్లా ? మూడు నెలలుగా ఉపాధ్యాయుల ఎదురుచూపులు
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల సాధారణ బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు నెలలుగా అదిగో... ఇదిగో అంటూ చెప్పడమే తప్ప ఆదేశాలు విడుదలవడం లేదు. ఆగస్టులోనే బదిలీలు నిర్వహిస్తా మని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సంబంధిత దస్త్రం ప్రాసెస్లోలో ఉండగానే... రాజకీయ పైరవీల బదిలీలకు తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా 220 వరకు పైరవీల బదిలీలకు దస్త్రం సిద్ధం చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సాధారణ బదిలీలకు ముందు పైరవీ బదిలీలను పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. గతంలో
బదిలీలు ఉన్నట్లా? లేనట్లా?
మూడు నెలలుగా ఉపాధ్యాయులు ఎదురుచూపులు
రెండేళ్ల సర్వీసు ఉన్న వారు మాత్రమే సాధారణ బది లీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా... ఈసారి సున్నా సర్వీసు వారికి కూడా అవకాశం కల్పి స్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. కొందరిని సర్దుబాటు కింద ఇతర పాఠశాలలకు డెప్యుటేషన్పై పంపించారు. బదిలీలు జరిగితే వీరందరికీ పోస్టింగులు లభిస్తాయి. ఇప్పటికే కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో
పనిచేస్తున్న వారు పట్టణాలు, నగరాలకు సమీపంలోకి వచ్చేందుకు అవకాశం కలుగుతుంది. బదిలీల్లో తీవ్ర ఆలస్యమైతే విద్యార్థుల చదువుపైనా ప్రభావం పడే అవ కాశం ఉంటుంది. ఈ ఏడాది జులై 5 నుంచి పాఠశా లలు ప్రారంభమయ్యాయి. బదిలీలకు కనీసం ఇప్పుడు ఆదేశాలిచ్చినా డిసెంబరు చివరినాటికి గాని పూర్తి కావు. బదిలీలు పొందిన వారు కొత్త బడుల్లో చేరిన నాలుగు. నెలలకే విద్యా సంవత్సరం ముగిసిపోతుంది. పాఠాలను త్వరగా ముగించాలనే ఆతృతతో ఉపాధ్యాయుడు వేగంగా బోధించే ప్రమాదముంది. ఇలాంటి సమస్య లను దృష్టిలో పెట్టుకుని, బదిలీల ప్రక్రియను త్వరి తంగా ముగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
0 Comments:
Post a Comment