మనం తరచుగా బిర్యానీ తినడానికి వెళ్లినప్పుడు రెస్టారెంట్లలో టూత్ పిక్స్ ను చూస్తాం.
ఈ ఒక్క దానికి మాత్రమే కాదు.. టూత్‌పిక్ వల్ల బోలెడు లాభాలున్నాయి. అవెంటో ఇక్కడ ఓ లుక్కేద్దాం.
కొవ్వొత్తులను వెలిగించడం కోసం : networx ప్రకారం, టూత్‌పిక్‌లు అగ్గిపుల్లల కంటే నెమ్మదిగా మరియు పొడవుగా కాలుతాయి. మనం అగ్గిపుల్లలతో వెలిగిస్తే చేతులు కాల్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కొవ్వొత్తులను వెలిగించడానికి టూత్‌పిక్‌లను ఉపయోగించవచ్చు.
కీబోర్డ్ శుభ్రం చేయడానికి: మనం కీ బోర్డులు శుభ్రం చేయడానికి చాలా కష్టపడతాం. కీబోర్డులు చాలా ఇరుకైన, చిన్న ఖాళీలను కలిగి ఉంటాయి. ఇలాంటి సమయంలో టూత్ పిక్ చాలా ఉపయోగపడుతుంది. మీరు టూత్‌పిక్ సహాయంతో కీబోర్డ్‌లోని మురికిని తొలగించవచ్చు.
విరిగిన కొమ్మను సరిచేయడానికి: ఇంట్లో పెరిగే మొక్క విరిగిన లేదా వంగిన కొమ్మను కలిగిఉంటే టూత్ పిక్ తో దాన్ని మీరు సరిచేయవచ్చు. మీరు మొక్క యొక్క కాండానికి టూత్‌పిక్‌ను కట్టవచ్చు. ఇది కాండాన్ని నిటారుగా ఉంచుతుంది.
టూత్‌పిక్‌లను కలప వస్తువుల్లో ఏర్పడ్డ చిన్న ఖాళీలను పూరించడానికి ఉపయోగించవచ్చు. టూత్‌పిక్‌పై ఫెవికాల్‌ను ఉంచి రంధ్రంలోకి చొప్పించండి. రంధ్రంలోకి టూత్ పిక్ ను చొప్పించిన తర్వాత .. మిగిలిన భాగాన్ని రీమూవ్ చేయండి.
దువ్వెన శుభ్రం చేయడానికి: మనం జట్టు దువ్వుకోవడానికి దువ్వెన వాడుతుంటాం. ఇలా వాడటం వల్ల దువ్వెన కొన్ని రోజుల తర్వాత మురికిగా మారుతుంది. అలాంటప్పుడు, దువ్వెన యొక్క ముళ్ళ నుంచి మురికిని టూత్‌పిక్ సహాయంతో సులభంగా తొలగించవచ్చు.
క్రాఫ్ట్ లేదా నగల తయారీలో: క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌లలో చిన్న సీక్విన్స్, చిన్న పూసలు, స్ఫటికాలను ఆభరణాలకు జోడించడానికి టూత్‌పిక్‌ని ఉపయోగించవచ్చు.
అలాగే, చిన్న చిన్న టిన్ ల్లో ఇరుకున్న వస్తువులను తీయడానికి.. ఏదైనా చిన్న వస్తువులకు పట్టిన మురికిని తొలగించడానికి టూత్ పిక్ కన్నా బెస్ట్ ఆప్షన్ మరొకటి ఉండదు.
ధూమపానం ఆపడానికి: కొన్ని రుచులతో కూడిన టూత్‌పిక్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ టూత్‌పిక్‌ని నమలడం వల్ల ధూమపానం మానేయవచ్చు.
0 Comments:
Post a Comment