📚✍️టీచర్ల బదిలీలు ఇంకెప్పుడు?
♦️ఉపాధ్యాయుల్లో అసహనం
🌻అమరావతి, ఆంధ్రప్రభ:
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయుల బదిలీలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాఠశాల విద్యా శాఖ అధికారులు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఉపాధ్యాయ బదిలీలు పూర్తయ్యేవి. కానీ ఈ ఏడాది నవంబర్ మాసం సగానికి చేరుకున్నా ఎప్పుడు బదిలీలు జరుగుతాయనేది స్పష్టం కావడం లేదు. సాధారణంగా ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇచ్చిన వెంటనే బదిలీలు చేపడతారు. ఈ ఏడాది ఆరున్నర వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇచ్చి నెల రోజులు దాటి పోయింది. వారికి కాగితాలపైనే పదోన్నతలు ఇచ్చారు తప్ప పాఠశాల ఏదనేది చూపించలేదు. బదిలీలు జరిగితే తప్ప వీరికి పాఠశాలల కేటాయింపు సాధ్యం కాదు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా పాఠశాల విద్యా శాఖ ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా స్కూళ్లను మ్యాపింగ్ చేసి 3,4,5 తరగతులను హైస్కూళ్లలో కలిపేశారు. దీంతో చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది.అందుకు తగ్గట్లుగా టీచర్ల సంఖ్య లేదు. బదిలీలు జరిపితే ఈ సమస్య కొంత తీరే అవకాశముంది. కానీ పాఠశాల విద్యా శాఖ మాత్రం తనకేం పట్టనట్లు వ్యవహరిస్తుంది.
♦️ఎందుకీ ఆలస్యం..?
వాస్తవానికి టీచర్ల బదిలీకి సంబంధించి ఫైల్ నెల రోజుల క్రితమే రెడీ అయ్యింది. దానిపై విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సంతకం పెట్టి 20 రోజుల కూడా గడిచిపోయినట్లు సమాచారం. కానీ పాఠశాల విద్యా శాఖ అధికారు లు మాత్రం షెడ్యూల్ విడుదల చేయడం లేదు. దీనికి కారణం కొంత మంది టీచర్లకు సిఫార్సులు ఆధారంగా బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతా ధికారులు భావిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధన లకు విరుద్ధంగా తమకు నచ్చిన వారికి మంచి స్థానాల్లోకి బదిలీ చేయబోతు న్నారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీనికి సంభంధించిన ఫైల్ పాఠశా ల విద్యా శాఖ ఉన్నతాధికారి వద్ద ఉందని, ముందుగా ఆ బదిలీలు చేసేందుకే మొత్తం బదిలీల ప్రక్రియను ఆపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో 200 మందికి పైగా సిఫార్సు బదిలీలు చేయాలని ప్రయత్నించగా ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలపడంతో ఆగిపోయారు. కానీ ఇప్పుడు మళ్లా దాదాపు 150 మంది జాబితాతో సిఫార్సు బదిలీలు చేయబోతున్నారని సమాచారం.
♦️బదిలీల కోడ్ అవసరం
ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వ ఇష్టానుసారం కాకుండా ఒక పకడ్బందీగా, విద్యార్ధులకు నష్టం కలగని రీతిలో నిర్వహించాలని సంఘాలు కోరుతు న్నాయి. ఇందుకోసం బదిలీల కోడ్ అంటే ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కోరుతున్నాయి. కేరళ, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కోడ్లు ఉన్నాయని, మన రాష్ట్రంలోనూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి ఉన్న కాలంలో డ్రాఫ్ట్ బిల్లును రూపొందించారని, ఆమెను బదిలీ చేసిన తర్వాత దాన్ని ఊసే పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. బదిలీలు ప్రతి ఏడాది వేసవి సెలవుల్లోనే జరగలాని, అప్పుడే విద్యార్దులకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
0 Comments:
Post a Comment