Swift @40km సరికొత్తగా స్విఫ్ట్, డిజైర్ కార్లు.. లీటర్‌కు 40 కిలోమీటర్లు!
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ.. మార్కెట్‌లోకి రెండు సరికొత్త హై మైలేజీ కార్లను తీసుకురాబోతున్నది. ఇప్పుడున్న స్విఫ్ట్ హచ్‌బ్యాక్, డిజైర్ కంపాక్ట్ సెడాన్ మోడళ్లను ఆధునికీకరించి 2024లో పరిచయం చేయనున్నది.
సరికొత్త స్విఫ్ట్, డిజైర్ కార్లను పరిచయం చేయనున్న మారుతీ
న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ.. మార్కెట్‌లోకి రెండు సరికొత్త హై మైలేజీ కార్లను తీసుకురాబోతున్నది. ఇప్పుడున్న స్విఫ్ట్ హచ్‌బ్యాక్, డిజైర్ కంపాక్ట్ సెడాన్ మోడళ్లను ఆధునికీకరించి 2024లో పరిచయం చేయనున్నది. ఈ పెట్రోల్ వేరియంట్ కార్లు.. లీటర్‌కు 35-40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని చెప్తుండటం విశేషం. ప్రస్తుత స్విఫ్ట్, డిజైర్ కార్లు లీటర్‌కు 21.12 కిలోమీటర్ల నుంచి 23.3 కిలోమీటర్లదాకా మైలేజీనిస్తున్నాయి.
ఈ రెండు మోడల్స్ సీఎన్‌జీలో కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, కొత్త కార్ల ధర ఇప్పుడున్న వాటి కంటే దాదాపు లక్ష, లక్షన్నర రూపాయలు ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు. కొత్త తరం స్విఫ్ట్ స్ట్రాంగ్ హైబ్రీడ్, డిజైర్ స్ట్రాంగ్ హైబ్రీడ్‌లకు సంబంధించిన మరిన్ని వివరాలను మారుతీ సుజుకీ త్వరలోనే విడుదల చేయనున్నది. ఇక గతకొద్ది నెలల నుంచి ఎస్‌యూవీలకు ఆదరణ పెరుగుతున్నా.. చిన్న కార్లకు డిమాండ్ తగ్గబోదన్న విశ్వాసాన్ని సంస్థ వ్యక్తం చేస్తున్నది.
0 Comments:
Post a Comment