📚✍️మాడుగుల ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్
🌻గురజాల, న్యూస్టుడే: ఉపాధ్యాయులు లేరంటూ పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం గురజాలలో రాస్తారోకో చేయడంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. పల్నాడు కలెక్టరు శివశంకర్ ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు డీఈవో వెంకటప్పయ్య తెలిపారు. హెచ్ఎంకు ఎలాంటి ఎలవెన్సులు ఇవ్వొద్దని జిల్లా ఖజానా అధికారికి ఉత్తర్వులిచ్చారు. సోమవారం ఉదయం ప్రధానోపాధ్యాయుడు రామారావు, గురజాల ఎంఈవో ప్రసాద్లను నరసరావుపేటకు పిలిపించారు. మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’ పనులు వేగంగా చేయట్లేదని ఇటీవల ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని కోరారు. దీన్ని అడ్డుపెట్టుకొని సస్పెండ్ చేసినట్లు ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. గురజాల ఎంఈవో ప్రసాద్, సత్తెనపల్లి డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లుకు షోకాజ్ నోటీసులు అందజేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment