Smart TV Offer: భారీ డిస్కౌంట్.. కేవలం రూ.12,700కే 43 అంగుళాల స్మార్ట్ టీవీ!
Flipkart Offer | మీరు కొత్తగా స్మార్ట్ టీవీ (Smart TV) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?
అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) సూపర్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరకే అదిరిపోయే టీవీని కొనుగోలు చేయొచ్చు.
ఇన్‌ఫినిక్స్ 43 అంగుళాల స్మార్ట్ టీవీని తక్కువ ధరకే పొందొచ్చు. ఈ టీవీని సగం రేటుకు కొనుగోలు చేయొచ్చు. ఇన్‌ఫినిక్స్ వై1 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ లినెక్స్ టీవీ ఎంఆర్‌పీ రూ. 24,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 13,999కు కొనొచ్చు. అంటే 44 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు.
ఈ ఆఫర్ మాత్రమే కాకుండా ఇతర డీల్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. 10 శాతం తక్షణ తగ్గింపు ఉంది. ఫెడరల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డుల ద్వారా టీవీ కొంటే అదనంగా రూ. 1250 మేర తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు ఈ టీవీని రూ. 12,749కే కొనుగోలు చేయొచ్చు. 43 అంగుళాల స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తోందని చెప్పుకోవచ్చు.
ఇంకా ఈ టీవీపై ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయ. నెలవారీ ఈఎంఐ రూ. 1257 నుంచి ప్రారంభం అవుతోంది. ఏడాది టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే మీరు 9 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1648 కట్టాలి. 6 నెలల ఈఎంఐ అయితే రూ. 2430 చెల్లించాలి. ఇక మూడు నెలల ఈఎంఐ అయితే రూ. 4776 కట్టాల్సి వస్తుంది. కాగా క్రెడిట్ కార్డు లేకపోతే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ ద్వారా కూడా ఈ టీవీని కొనుగోలు చేయొచ్చు. ఈఎంఐ ఆఫర్లు అనేవి క్రెడిట్ కార్డు ప్రాతిపదికన మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ద్వారా ఈ టీవీ కొంటే నెలవారీ ఈఎంఐ రూ. 486 నుంచి పెట్టుకోవచ్చు. 36 నెలల ఈఎంఐ టెన్యూర్ ఎంచుకోవాల్సి వస్తుంది. 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 679 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత టీవీ మోడల్, కండీషన్ ప్రాతిపదికన ఎక్స్చేంజ్ విలువ మారుతుందని గుర్తించుకోవాలి. తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. నవంబర్ 25 నుంచి ఈ టీవీ సేల్ ప్రారంభం అవుతుంది.
0 Comments:
Post a Comment