Skin Care Tips: వింటర్ లో రోజు నైట్ ఇలా చేస్తే చర్మం తేమగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది!
వింటర్ సీజన్ లో చాలా మంది డ్రై స్కిన్ తో తీవ్రంగా సతమతం అవుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఖరీదైన మాయిశ్చరైజర్స్ ను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు.
అయితే ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్స్ వాడిన వాటి ప్రభావం కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాను కనుక పాటిస్తే పొడి చర్మం సహజంగానే తేమగా మరియు కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక పల్చటి వస్త్రాన్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి అందులో ఉండే వాటర్ ను పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో నీరు తొలగించిన పెరుగును వేసుకోవాలి. అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆపై నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ప్రస్తుత వింటర్ సీజన్ లో ప్రతి రోజూ నైట్ నిద్రించే ముందు ఈ విధంగా గనుక చేస్తే ఉదయానికి చర్మం తేమగా మరియు కాంతివంతంగా మారుతుంది. పొడి చర్మం అన్నమాట అనరు.
పైగా ఈ చిట్కాను పాటించడం వల్ల చర్మంపై మొండి మచ్చలు క్రమంగా దూరం అవుతాయి. సాగిన చర్మం టైట్ గా మారుతుంది ముడతలు ఏమైనా ఉన్నా సరే తగ్గు ముఖం పడతాయి. కాబట్టి ప్రస్తుత వింటర్ సీజన్ లో తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను మీ డైలీ రొటీన్ లో భాగం చేసుకోండి. అందంగా మెరిసిపోండి.
0 Comments:
Post a Comment