చర్మ సంరక్షణలో ఏ విధమైన నిర్లక్ష్యం మంచిదికాదు. స్కిన్ కేర్ కోసం సరైన ప్రొడక్ట్‌ను ఎంచుకోవల్సి ఉంటుంది. చాలా రకాల చిట్కాలు కూడా చర్మ సంరక్షణలో దోహదపడతాయి.
అదే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
చర్మ సంరక్షణలో కీలకంగా ఉపయోగపడేవి రెండు. ఒకటి మాయిశ్చరైజర్ కాగా, రెండవది సన్‌స్క్రీన్. అయితే ఈ రెండింటికీ మధ్యం అంతరమేంటనేది చాలామంచిది తెలియదు.
ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటనేది ఇప్పుుడు తెలుసుకుందాం..రెండింటికీ తేడా తెలుసుకోకుండా వినియోగిస్తే హాని చేకూరే ప్రమాదముంది.
మాయిశ్చరైజర్
ముందుగా మాయిశ్చరైజర్ గురించి తెలుసుకుందాం. చర్మాన్ని తేమగా అంటే హైడ్రేట్‌గా ఉంచేందుకు మాయిశ్చరైజర్ వినియోగిస్తాము. చలికాలంలో చర్మం సహజంగానే ఎండిపోతుంటుంది.
అందుకే చలికాలంలో మాయిశ్చరైజర్ అధికంగా వినియోగిస్తుంటారు. రాత్రి నిద్రపోయే ముందు లేదా స్నానం తరువాత రాయాలి.
సన్‌స్క్రీన్
ఎండలో తిరిగేటప్పుడు ట్యానింగ్, హానికల్గించే కిరణాల్నించి రక్షించే క్రీమ్‌ని సన్‌స్క్రీన్ అంటారు. సూర్య కిరణాలు నేరుగా శరీరంలో ఏ భాగంపై పడతాయో ఆ భాగంపై సన్‌స్క్రీన్ రాసుకోవాలి.
సన్‌స్క్రీన్‌ను సన్‌బ్లాక్, సన్‌బర్న్, సన్‌ట్యాన్ లోషన్‌గా కూడా పిలుస్తారు.
అంటే మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రెండూ చర్మ సంరక్షణకు చాలా అవసరం. చర్మం డ్రైగా ఉన్నప్పుడు రెండూ వినియోగించాల్సి ఉంటుంది.
డ్రైగా లేకపోతే మాత్రం కేవలం నస్ స్క్రీన్ వినియోగిస్తే సరిపోతుంది. రెండింటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనేది గుర్తుంచుకోవాలి. మాయిశ్చరైజర్‌ను ఎప్పుడూ సన్‌స్క్రీన్ కంటే ముందు రాయాలి.
0 Comments:
Post a Comment