భారతదేశంలో హిందువులు, మరి ముఖ్యంగా మహిళలు ముఖాన బొట్టును ధరిస్తూ ఉంటారు. పెళ్లయిన ఆడవారు నుదుటి తో పాటు పాపిట్లో కూడా కుంకుమ ధరిస్తూ ఉంటారు.
బొట్టు లేని ముఖం ముగ్గులేని ఇంటి వంటిది అనే సామెత చెబుతూ ఉంటారు. ఇంటిముందు ముగ్గు లేకపోతే ఏ విధంగా అయితే దరిద్ర దేవత తాండవం ఆడుతుందో అదేవిధంగా ముఖంలో బొట్టు లేకపోతే శని దేవుడు దరిద్రదేవత తాండవం చేస్తాయి.
శనీశ్వరుడు, జ్యేష్ఠదేవి ఇద్దరూ భార్య భర్తలు. వీరిలో ఒకరు ఉంటే రెండోవారు కచ్చితంగా ఉంటారు. అందుకే తరచూ మన పెద్దలు బొట్టు పెట్టుకోమని చెబుతూ ఉంటారు.
ఎదుటి వ్యక్తులు మనం ముఖాన్ని చూసినప్పుడు వారి కంటి నుండి వచ్చే నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ
మన కనుబొమ్మల రెండింటికీ మధ్య స్థానంలో కేంద్రీకృతమవుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.
అయితే ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. కాబట్టి ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు మన ముఖములో కనిపిస్తాయి.
తద్వారా మన మెదడు దెబ్బ అవకాశం ఉంటుంది. దాంతో మనకు తలనొప్పి రావడం మనఃశాంతి పోవడం,చిరాకుగా కనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ఏ విషయంపై అంత తొందరగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వ్యక్తి కంటి నెగిటివ్ ఎనర్జీ మనపై పడకుండా ఉండాలి అంటే మన కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకుంటే చాలు.
మనం నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి చూపు మన నుదుటి మీద పడినా కూడా మన సున్నితమైననాడులను ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది. ఇదే విషయాన్ని సైంటిఫిక్ గా కూడా నిరూపించబడింది.
0 Comments:
Post a Comment