"Sankalp Siddhi Mart" fruad in vijayawada
వస్తువులు కొంటే.. డబ్బు రిటర్న్ : బెజవాడలో ''సంకల్ప్ సిద్ధి మార్ట్'' పేరిట రూ.1500 కోట్లు టోకరా.
బెజవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వస్తువులు కొనుగోలు చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయంటూ భారీ మొత్తంలో ఖాతాదారులను చేర్చుకుని జనాన్ని బురిడీ కొట్టించింది సంకల్ప సిద్ధి అనే సంస్థ.
తమతో పాటు మరో ఇద్దరిని చేర్చితే కమీషన్ ఇస్తామంటూ ఆశ చూపి ఆన్‌లైన్ ద్వారా వేలాది మంది ఖాతాదారులను చేర్చుకున్నారు. ప్రారంభించిన కొద్దినెలల్లోనే మూడు బ్రాంచీలు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.1500 కోట్ల వరకు సంకల్ప సిద్ధి మార్ట్‌లో టర్నోవర్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఘటనపై కేసు నమోదు చేసి సంకల్ప సిద్ధి చైన్ లింక్స్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఎవరైనా వుంటే ముందుకు రావాలని కోరారు పోలీసులు.
ఇకపోతే.. ఇటీవల మహబూబ్‌నగర్‌లో ఆన్‌లైన్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా క్యాటర్ పిల్లర్ ఆన్‌లైన్ యాప్ పేరుతో జనానికి కుచ్చుటోపి పెడుతున్నారు కేటుగాళ్లు. మూడింతల లాభాలు అంటూ కోట్లలో డిపాజిట్లు చేయించుకుంది ఆన్‌లైన్ ముఠా. సీసీ కుంట, దేవరకద్ర, తవుకుంట్ల మండలాల్లో ఈ యాప్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మోసపోయారు జనం. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పెద్ద సంఖ్యలో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
0 Comments:
Post a Comment