Salary - ఇచ్చినప్పుడు తీసుకోండి !- జీతాల కోసం యాగీ ఎందుకు ? - మీరంత కరెక్ట్ గా పనిచేశారా ? - బొత్స ఇలాకాలో టీచర్లకు వార్నింగ్
ఇచ్చినప్పుడు తీసుకోండి!
» జీతాల కోసం యాగీ ఎందుకు?
» మీరంత కరెక్ట్ గా పనిచేశారా?
» బొత్స ఇలాకాలో టీచర్లకు వార్నింగ్
(విజయనగరం-ఆంధ్రజ్యోతి) "నెల రోజులు కష్టపడ్డాం.. మా జీతం ఇవ్వండి. కుటుంబా లను పోషించుకోవాలి" అని అడిగిన పాపానికి మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో టీచర్లకు ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు ఎదురవుతున్నాయి. 'మీరంత నిక్కచ్చిగా పనిచేశారా?, ఇచ్చినప్పుడు తీసుకోండి' అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. జిల్లాలోని 8 మండ లాల ఉపాధ్యాయులకు 9వ తేదీ దాటినా ప్రభుత్వం జీతాలు | ఇవ్వలేదు. దీంతో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జిల్లాలోని ఖజానా కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా చేశారు. జీతాలు వెంటనే చెల్లించాలని నినదించారు. సీపీఎస్ రద్దు వంటి వాటిపై దృష్టి పెట్టకుండా ఉండేలా జీతాల కోసం ఇబ్బందులు పెడుతున్నారన్న వాదన కూడా ఉపాధ్యా యుల నుంచి విన్పిస్తోంది. కాగా, జామి మండలంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మూడురోజుల కిందట భోజన విరామ సమయంలో జీతాలు చెల్లించాలని కోరుతూ నిరసన చేపట్టారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం. రెండురోజులు జీతాలు ఆలస్యం అయితే కొంపలు మునుగుతాయా? అంటూ ఓ ఉన్నతాధికారి ప్రశ్నించడం చర్చనీయాంశం అయింది. మీరు ఉద్యోగాలు అంత అంకిత భావంతో నిక్కచ్చిగా పనిచేస్తు న్నారా? అని బెదిరించినట్లు తెలిసింది. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఏంటని హెచ్చరించినట్లు సమాచారం. ఉపాధ్యాయుల నుంచి సంజా యిషీ కూడా తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ప్రతినెలా 1న జీతాలు అందేవని, వైసీపీ హయాంలో ఎప్పుడు అందు తాయో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. జీతాలు అడిగే టీచర్లపై కక్షపూరితంగా వ్యవహరిం చడం సబబు కాదని యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment