*📚✍️జీతాలు*
*ఇంకెప్పుడిస్తారు?✍️📚*
*♦️రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.*
*అక్టోబరు నెలకు సంబంధించి నేటికీ జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలతో ఎలా గడపాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.*
*♦️విజయనగరంలో ఉపాధ్యాయుల ధర్నా*
*♦️ప్రభుత్వ తీరుకు నిరసనగా 'మన్యం'లో భిక్షాటన*
*🌻విజయనగరం కలెక్టరేట్, పార్వతీపురం రూరల్, నవంబరు 8:* రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. అక్టోబరు నెలకు సంబంధించి నేటికీ జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలతో ఎలా గడపాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈమేరకు మంగళవారం పార్వతీపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా భిక్షాటన చేశారు. సర్కారు తీరుతో ప్రస్తుతం ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని యూటీఎఫ్ సంఘం జిల్లా నాయకులు తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీకే జీతాలు చెల్లించాలని, బైజూస్ కార్యక్రమంలో భాగంగా ఫోన్ నంబర్లు సేకరించలేదన్న నెపంతో ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రాన్ని అందించారు. విజయనగరంలో జరిగిన ధర్నాలో యూటీఎఫ్ నాయకుడు డి.రాము మాట్లాడుతూ గంట్యాడ, జామి, మెంటాడ, డెంకాడ, రేగిడి, రామభద్రపురం, దత్తిరాజేరు, విజయనగరం రూరల్, ఆర్బన్ మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అక్టోబరు నెల జీతాలు ఇంకా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. జీతాలు విడుదల చేయాలని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, డీఆర్‌వో గణపతిరావుకు వినతిపత్రం అందజేశారు.
0 Comments:
Post a Comment