Search This Blog

Sunday, 6 November 2022

Rivers : ప్రపంచంలో నదులు లేని దేశాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

 నీరు మానవ మనుగడకు అత్యంత ప్రధానమన్న విషయం తెలిసిందే. ఈ సృష్టి దాదాపు 71 శాతం నీటితో (సముద్రాలు, నదులు, సెలయేరుల రూపంలో), 29 శాతం భూభాగం, పర్వతాలు, కొండలు, మైదాన ప్రాంతాలతో నిండి ఉంది.

మానవ కనీస అవసరాలలో ఒకటైన ఆహారోత్పత్తికి నీరు అత్యంతావశ్యకం. సహజ నదులు సమృద్ధంగా ఉండి వాటికి అనుబంధంగా ఉపనదులు, కాలువలు ఉన్న ప్రాంతాలు సారవంతంగా ఉండడమే కాక వ్యవసాయానికి అత్యంత అనువుగా ఉంటాయి. అదృష్టవశాత్తు భారతదేశంలో ఎన్నో నదులు ఉండడంతో అత్యధికంగా ప్రజలు వ్యవసాయమే జీవనోపాధిగా జీవనం సాగిస్తున్నారు.

ప్రపంచంలో ఒక్క నది కూడా లేని దేశాలు పందొమ్మిది (కోమోరోస్, డిజిబౌటి, లిబియా, మాల్టా, వ్యాటికన్ సిటీ, మొనాకో, కిరిబాటి, మార్షల్ దీవులు, నౌరూ, టోంగా, టువాలు, బహ్రెయిన్, కువైట్, మాల్దీవులు, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమన్) ఉన్నాయంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. నదులు లేని పెద్ద దేశాలు అత్యధికంగా మధ్య ప్రాచ్యంలోను, కొన్ని ఐరోపా ఖండంలోనూ. పసిఫిక్ దీవులలోని ఎడారి ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఎడారి దేశాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనివుండే దేశాలలో సాధారణంగా సహజ నదులు ఉండకపోవడమే కాక యేడాది పొడవునా శాశ్వతంగా ప్రవహించే నీటి వనరులు కూడా ఉండవు. నదులు లేని దేశాల గురించి తెలుసుకుందాం.

కామోరోస్

తూర్పు ఆఫ్రికాలో మొజాంబిక్-మడగాస్కర్ మధ్యన 719 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 8,50,886 జనాభా గల ఈ దేశ నీటి అవసరాలు చాలా వరకు భూగర్భ జలాల ద్వారా సమకూరుతాయి. ఈ దేశం ప్రధానంగా భూగర్భంలో అట్టడుగున ఉండే జలధారల నుండి రక్షిత మంచి నీటిని సేకరించుకుంటుంది. ఈ దేశంలోని అధిక భూభాగం ఉష్ణమండలంగా కనిపించినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో సంవత్సరానికి వంద అంగుళాల వర్షపాతం నమోదు కావడంతో దీనిని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతంగా వర్గీకరించవచ్చు. పెరుగుతున్న సముద్ర మట్టం భూగర్భ జలాలను ఉప్పగా మారుస్తుండగా మరో పక్క అభివృద్ధి చెందుతున్న ఆధునిక నాగరికత పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది.

డిజిబౌటి

ఆఫ్రికాకు తూర్పు దిశన ఇథియోపియా, సోమాలియా దగ్గర 8,958 చదరపు మైళ్ల వైశాల్యంతో 9,21,804 జనాభా గల డిజిబౌటి ఏడాది కన్నా కూడా ఎక్కువ కాలం పాటు వర్షపాతం నమోదు కాని ప్రాంతం. అయినప్పటికీ, ఆ దేశంలో వాడీలు (ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసినప్పుడు సంతృప్త నదీగర్భంలో కొన్ని ప్రాంతాలలో ప్రవహించే నీరు) ఉన్నాయి. ఈ దేశంలోని 95 శాతం నీటి అవసరాలు భూగర్భ జలాల ద్వారానే తీరుతాయి. చాలా వరకు నీటిని పట్టణ ప్రాంతాలకు, వ్యవసాయానికి వినియోగిస్తారు. కామోరోస్‌లో లాగా డిజిబౌటిలో కూడా నీరు ఉప్పునీటితో కలుషితమవుతోంది. భూగర్భ అట్టడుగున ఉండే జలధారలలోని ఉప్పును వేరు చేయడం అతి ప్రయాసతో కూడుకున్న వ్యవహారం.

లిబియా

ఉత్తర ఆఫ్రికాలో 6,79,363 చదరపు మైళ్ల వైశాల్యంతో 69,92,701 జనాభా కలిగిన లిబియా ఈజిప్ట్-అల్జీరియా మధ్యన ఉంది. అమెరికాలోని అలాస్కా రాష్ట్రం కంటే కూడా వైశాల్యంలో పెద్దది. సహజ సిద్ధ నదులు లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ దేశంలో కూడా వాడీలు ఉన్నప్పటికీ అత్యధిక భాగం భూగర్భ జలాలు పునరుత్పాదకతకు అననుకూలమైనవి. కోస్తా తీరంలో అత్యధిక నగరాలు కలిగిన ఈ దేశంలోని భూగర్భ జలాలు రోజు రోజుకూ అడుగంటిపోతుండడంతో బాటు పెరుగుతున్న సముద్ర మట్టాలతో ఉప్పునీటి సమస్య తీవ్రమవుతోంది. 1950 నుండి నేటి వరకు ఈ దేశ జనాభా మూడింతలు పెరగడంతో రక్షిత మంచినీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. సహజ నదులు లేకపోవడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం, అడుగంటుతున్న భూగర్భ జలాలతో లిబియా పరిస్థితి ఆందోళనకరమే.

బహ్రెయిన్

ఆసియా ఖండంలో సహజ నదులు లేని ఎనిమిది దేశాలు అరేబియా ద్వీపకల్పంలో చూడవచ్చు. మాల్దీవులు ఇందుకు మినహాయింపు. బహ్రెయిన్ పర్షియన్ గల్ఫ్‌లో 303 చదరపు మైళ్ల వైశాల్యంతో 15,69,446 జనాభా కలిగిన ద్వీపం. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సముద్ర మట్టాలు బహ్రెయిన్‌పై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఈ దేశం తన నీటి అవసరాలను భూగర్భ జలాలు, సముద్ర జలాల నుంచి నీటిని శుద్ధి చేసి వాడుకుంటోంది. 88 శాతం నీటి సరఫరా అత్యధిక ఖర్చుతో కూడుకున్న శుద్ధి కేంద్రాల ద్వారా చేయబడుతోంది. ధరను అతి తక్కువగా నిర్ణయించడం ద్వారా ప్రజలకు రక్షిత మంచి నీరు అందే వెసులుబాటును అక్కడి ప్రభుత్వం కల్పిస్తోంది. వ్యవసాయానికి ఆవిరి వాడకం, వర్షపు నీటిని ఓడిసిపట్టడం, నీటి సంక్షేపనం లాంటి ప్రయోగాలను చేపడుతోంది.

కువైట్

పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, సౌదీ అరేబియా సరసన 6,880 చదరపు మైళ్ల వైశాల్యంతో 44,20,110 జనాభా కలిగి ఉన్న కువైట్‌లో కొన్ని వాడీలు ఉన్నప్పటికీ అవి ఆ దేశ నీటి అవసరాలను తీర్చే స్థాయిలో లేవు. చమురు కర్మాగారాల కారణంగా గత 50 సంవత్సరాలలో ఆ దేశం చాలా అభివృద్ధి చెందింది. 93 శాతం నీటి అవసరాన్ని సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేయడం ద్వారా సమకూర్చుకుంటుంది. అయితే సముద్రపు నీటిని శుద్ధి చేయడం ద్వారా వెలువడే వ్యర్థాలు, శిలాజ ఇంధనాలు మానవులు, ఇతర జంతు జాలాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

మాల్దీవులు

మాల్దీవులు భారత్‌కు దక్షిణాన హిందూ మహా సముద్రంలో 120 చదరపు మైళ్ల వైశాల్యంతో 5,57,426 జనాభా కలిగి ఉంది. చాలా దిబ్బలు, బీచ్‌ల సమూహంతో కూడిన మాల్దీవులు ప్రముఖ పర్యాటక కేంద్రం. వడపోత ద్వారా మంచినీటిని వేరు చేసే ప్రక్రియ ద్వారా ఇక్కడ పరిస్థితి తీవ్రమవుతోంది. 2004లో సంభవించిన సునామీ ప్రభావంతో ఇక్కడి సహజ జలాశయాలు కలుషితమైపోయాయి. ద్వీపం వెలుపలి భాగాలలో నివసించే ప్రజలు తీవ్ర మంచి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఇతర దేశాల నుంచి నీటిని దిగుమతి చేసుకోవడం, వర్షపు నీటి పై ఆధారపడడం చేస్తున్నారు.

ఓమన్

అరేబియా ద్వీపకల్పంలోని యెమెన్ పక్కన 1,19,500 చదరపు మైళ్ల వైశాల్యంతో 48,29,473 జనాభా గల దేశం ఓమన్. ఈ దేశంలో కూడా వాడీలు ఉన్నప్పటికీ ప్రధానంగా భూగర్భ జలాల మీదనే ఆధారపడుతుంది. వాడీల ద్వారా ఏర్పడే వరద విపత్తులను ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం ఆనకట్టలు నిర్మించి వాటిని భవిష్యత్ అవసరాల కోసం వాడుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది.

ఖతార్

పర్షియన్ గల్ఫ్‌లో 4,471 చదరపు మైళ్ళ వైశాల్యంతో 27,95,484 జనాభా కలిగిన కువైట్‌లో 99 శాతం నీటి అవసరాలు సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేయడం ద్వారా సమకూరుతుంది. ఈ ప్రక్రియ అధిక ఖర్చుతో కూడుకున్నది. ఈ దేశంలో కూడా వాడీలు ఉన్నప్పటికీ అవి ఆ దేశ నీటి అవసరాలను తీర్చే స్థాయిలో లేవు.

సౌదీ అరేబియా

8,30,000 చదరపు మైళ్ల వైశాల్యంతో 3,42,18,169 జనాభా గల సౌదీ అరేబియా ప్రపంచంలోనే సహజ నదులు లేని అతి పెద్ద దేశం. తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణంతో వాతావరణ మార్పులకు లోనవుతున్న దేశాలలో ఒకటి. వందల సంఖ్యలో అందుబాటులో ఉన్న వాడీలపై ప్రభుత్వం ఆనకట్టలు నిర్మించి భవిష్యత్ అవసరాల వినియోగం కోసం భద్రపరచే ప్రయత్నం చేస్తుంది. చమురు పరిశ్రమ పురోగతితో గత 39 సంవత్సరాలలో ఈ దేశ జనాభా గణనీయంగా పెరగడంతో పాటు జీవన ప్రమాణం కూడా పెరిగింది. దీనితో పాటు తలసరి నీటి వినియోగం కూడా పెరిగింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

అరేబియా ద్వీపకల్పంలో సౌదీ అరేబియా, ఓమన్ పక్కన 32,300 చదరపు మైళ్ల వైశాల్యంతో 92,82,410 జనాభా గల దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశంలో కూడా వాడీలు ఉన్నప్పటికీ అవి దేశీయ నీటి అవసరాలను తీర్చే స్థాయిలో లేవు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామీకరణ, సాగు విస్తీర్ణం తీవ్ర నీటి ఎద్దడికి కారణమవుతోంది. అందుబాటులో ఉన్న భూగర్భ జలాలలో 70 శాతం వ్యవసాయానికి వాడుకోవడంతో పాటు వ్యర్థ జలాలను శుభ్రం చేసి ఇతర అవసరాల కోసం వినియోగిస్తారు. శుద్ధి చేసిన వ్యర్థ జలాలను వ్యవసాయ వినియోగం కోసం వాడే అవకాశాలను అధ్యయనం చేస్తోంది ఈ దేశం.

యెమెన్

అరేబియా ద్వీపకల్పంలో సౌదీ అరేబియాకు దక్షిణాన 2,14,000 చదరపు మైళ్ల వైశాల్యంతో 3,04,91,000 జనాభా గల దేశం యెమెన్. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నది. పరిస్థితి తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాలికలను సిద్ధం చేయకపోవడం గమనార్హం. వాడీలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని నీటి అవసరాల కోసం వాడుకోవడం లేదు. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే నిర్జలీకరణ (dehydration) కారణంగా దేశంలో మూకుమ్మడి మరణాలు సంభవించే ప్రమాదముంది. ఇప్పటికే ఇక్కడి ప్రజలు నీటి ఎద్దడితో ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నారు.

మాల్టా

ఐరోపాలో సహజ నదులు లేని దేశాలు మూడు ఉండగా అందులో వాటికన్, మొనాకో రెండు చాలా చిన్నవి. మాల్టా దీవులు మెడిటరేనియన్‌లో ఉంది. 122 చదరపు మైళ్ల వైశాల్యంతో 5,16,100 జనాభా గల ఈ దీవి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. పర్యాటక రంగ ఆదాయం ప్రధాన ఆదాయ వనరుగా గల ఈ దేశంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండడంతో నీటి ఎద్దడి నానాటికీ తీవ్రతరమవుతోంది. భూగర్భ జలాలు కూడా ఉప్పుతో కలుషితమవుతున్నాయి.

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top