🔵Packaging Instructions:
*1. అన్ని సబ్జెక్టుల అసెస్మెంట్ పూర్తయిన తర్వాత, ఉపయోగించిన OMR షీట్లు తరగతుల వారీగా విడివిడిగా ప్యాక్ చేయండి.*
*2. పాఠశాల స్థాయిలో, తరగతుల వారీగా ప్యాక్ చేసిన ప్యాకెట్లను ఒక పెట్టెలో ఉంచి, ఈ ప్యాకేజీలను MEOs కి పంపినట్లు నిర్ధారించుకోండి.*
*Specific Instructions for Test administration – Classes 1, 2 and 3*
*page-00021. పరీక్ష పత్రంలో ఇచ్చిన లేబుల్ పై UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను పూరించండి.*
*2. ప్రతి సబ్జెక్టులో అన్ని ప్రశ్నలను ఉపాధ్యాయులు గట్టిగా చదివి విద్యార్ధులకి వినిపించాలి.*
*3. ప్రశ్నాపత్రంలోని ఒక్కొక్క ప్రశ్నను గట్టిగా మరియు నిధానంగా చదివినట్లయితే, విద్యార్థులు సులభంగా అర్ధం చేసుకోవచ్చు.*
*4. ఒక ప్రశ్న చదవడం పూర్తయిన తర్వాత, విద్యార్థులు తమ ప్రశ్నాపత్రాల్లో సమాధానాలను గుర్తించడానికి తగినంత సమయం ఇవ్వండి. అవసరమైతే ప్రశ్నను మరలా ఇంకొక్కసారి చదివి వినిపించండి.*
*5. విద్యార్థులు, పరీక్ష పత్రాలలో వారు అనుకున్న సమాధానాలను సరిగ్గా గుర్తిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.*
*6. అదనపు సూచనలు లేదా సహాయం లేదా సమాధానాలకు సంబంధించిన క్లూలు విద్యార్థులకి ఇవ్వకూడదు ఎందుకంటే అది విద్యార్థులకు అదనపు సహాయాన్ని అందించవచ్చు.*
*7. బ్లాక్ బోర్డపై, పరీక్ష పత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్ధులకి చూపండి.*
*8. ఎంపికలు లేని ప్రశ్నలకి, పరీక్ష పత్రాలలో సమాధానాలను స్పష్టంగా రాయమని విద్యార్థులకి తెలియజేయండి. పరీక్ష పూర్తయిన తర్వాత, పరీక్ష పత్రాలను తిరిగి తీసుకోండి. ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులు సరిగ్గా నింపారో లేదో చూసుకోండి.*
*9. సంబంధిత సబ్జెక్టు పరీక్ష పూర్తయిన తర్వాత, ఇన్విజిలేటర్ సంబంధిత సబ్జెక్ట్ కింద బాల్ పెన్నుని ఉపయోగించి OMRలలో విద్యార్థులు ప్రశ్నా పత్రాలలో వ్రాసి ఇచ్చిన బహుళైశ్చిక ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి.*
*10. 3వ తరగతి EVS పరీక్ష వ్రాస్తున్నవారు, EVS/ సైన్స్ కాలమ్ కింద వారి సమాధానాలను గుర్తించాలి.*
*11. OMR షీట్లో విద్యార్థి సమాధానాలను గుర్తించేటప్పుడు, విద్యార్థి పేరు, విద్యార్థి ID అను వివరాలు పరీక్ష పత్రంపై పేరుతో సరిపోలుతున్నట్లు నిర్ధారించుకోండి.*
*Specific Instructions for Test administration – Classes 4,5,6,7,8:*
*1. బోర్డుపై UDISE కోడ్ వ్రాసి, విద్యార్థి IDలు సిద్ధంగా ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా పరీక్షకు ముందుగా విద్యార్ధులకు ఈ IDలు గూర్చి తెలిసేలా నిర్ధారించుకోండి.*
*2. విద్యార్థులు పరీక్ష పత్రంలో UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను సరిగ్గా వ్రాసినట్లు నిర్ధారించుకోండి.*
*3. OMR షీటుపై UDISE కోడ్, విద్యార్థి పేరు మరియు విద్యార్థి ID వివరాలు ఇవ్వబడతాయి. కాబట్టి OMR షీటులను విద్యార్థులకు అందజేస్తున్నప్పుడు, ప్రతి విద్యార్ధి వారి సంబంధిత OMRని పొందారని నిర్ధారించుకోండి.*
*4. విద్యార్థులు, OMR షీటులను జాగ్రత్తగా నలపకుండా ఉంచేలా నిర్ధారించుకోండి.*
*5. విద్యార్థులు ప్రశ్న పత్రాలపై సమాధానాలను టిక్ చేసి, వాటిని సమాధాన పత్రాలపై సరిగ్గా బబుల్ చేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.*
*6. బ్లాక్ బోర్డపై, పరీక్ష పత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్ధులకి చూపండి*
*7. OMRలలో బహుళైశ్చిక ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి.*
*8. ప్రతి బహుళైశ్చిక ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయని, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైనదని విద్యార్థులకు సూచించండి*
*9. బ్లాక్ బోర్డపై OMRని బబ్లింగ్ చేసే పద్ధతిని విద్యార్థులకి చూపండి. బబ్లింగ్ సరిగ్గా ఎలా చేయాలో విద్యార్ధులు అ చేసుకోవడం చాలా అవసరం. విద్యార్థులు సమాధానాలను సరిగ్గా బబ్లింగ్ చేస్తున్నారో లేదో తనిఖీ చేయండి.*
*10. ఎంపికలు లేని ప్రశ్నలకి, విద్యార్థులకి అందజేసిన సమాధాన పత్రాలలో సమాధానాలను వ్రాయమని విద్యార్థులకు సూచించండి.*
*11. పరీక్ష పత్రాలను విద్యార్థులకు అందజేసిన తర్వాత, విద్యార్థులు పరీక్షను ప్రారంభించే ముందు, ఒకసారి పరీక్ష పత్రాన్ని నిశ్శబ్దంగా చదవమని వారికి తెలుపండి.*
*12. సంబంధిత సబ్జెక్టు కింద సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి. ఉదాహరణకు: ఇంగ్లీషు సబ్జెక్టు యొక్క సమాధానాలను ఇంగ్లీష్ కాలమ్ క్రింద గుర్తించాలి.*
*13. 4 మరియు 5వ తరగతి విద్యార్థులకు, తెలుగు మరియు ఇంగ్లిష్ సబ్జెక్టులలోని ఉన్న పాసేజ్ లను మాత్రమే గట్టిగా చదివి వినిపించాలి. విద్యార్థులందరికీ అర్థమయ్యేలా పాసేజ్ని గట్టిగా మరియు నిధానంగా చదవాలి. అవసరమైతే ఆ భాగాన్ని మరలా ఇంకోసారి చదవి వినిపించండి.*
*14. పరీక్ష పూర్తయిన తరువాత ప్రశ్నాపత్రాలు, OMR షీట్లను తిరిగి తీసుకోండి. OMR షీట్లను ప్రతి పరీక్ష ముందు అందచేయవలసి ఉంటుంది.*
Revised CBA / FA 1 Time Table
Orientation on Class Room Based Assessment on 29.10.2022 at 10.30 a.m by AP SCERT
జిల్లా విద్యాశాఖ అధికారులు అందరికీ నమస్కారం. ఈ ఉదయం 10:30 గంటల నుండి యూట్యూబ్ లింకు ద్వారా రాష్ట్రంలోని అందరూ ఉపాధ్యాయుల కి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ పైన ఓరియంటేషన్ ఇవ్వబడును. గౌరవ కమిషనర్ గారు మరియు ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ వారు CBA పై అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు సూచనలు ఇస్తారు. కావున ఈ యూట్యూబ్ లింక్ ని మీ పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకి పంపవలెను
ఈ లింక్ లో ఓరియంటేషన్ చూడండి....
FA 1 ; Syllabus from SCERT AP - 2022 -23
SCERT AP
SYLLABUS
2022-23
FA1 FOR CLASSES 9-10
CLASS ROOM BASED ASSESSMENT
FOR CLASSES 1 - 8
Download....Syllabus pdf Copy
FA 1- Exams - CBA instructions in Telugu
Formative Assessment - 1 2022-2023 Time Table Released.
School Education – SCERT- AP –Assessments- Classroom Based : Assessment (CBA) for classes I to VIII, Formative assessment - 1 for classes IX & X – Timetable for the Academic year 2022-23 – Orders– Issued-Reg××.
0 Comments:
Post a Comment