ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూముల రీ సర్వే ప్రారంభమైంది. 100 సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో భూములను రీ సర్వే చేస్తున్నారు. గతేడాది ప్రభుత్వం నమూనాగా కొన్ని భూములను సర్వే చూసిన కార్యక్రమం విజయవంతమైంది.
తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తొలి దశలో భాగంగా గతేడాది 2వేల గ్రామాల్లో రీ సర్వే జరిగింది. ఆధునిక పద్ధతిలో డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమవుతాయి. ఇవి ఎంత తొందరగా పూర్తిచేస్తే లబ్ధిదారులకు అంత త్వరగా పంపిణీ జరుగుతుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ సర్వే చేపడుతున్నారు. 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నారు. ఫిబ్రవరిలో రెండో దశ కింద 4వేల గ్రామాల్లో, మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు సిద్ధం చేస్తారు. ఆగస్టుకల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది.
ప్రతి కమతానికి ఐడీ నెంబరు
2023 డిసెంబరు నాటికి సర్వే మొత్తం పూర్తి కానుంది. సివిల్ కేసుల్లో ఎక్కువగా భూ వివాదాలే ఉన్నాయి. సరైన వ్యవస్థ లేకపోవడంవల్లే అన్నదాతలు నష్టపోతున్న పరిస్థితి. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ ఇస్తారు. అలాగే ప్రతి కమతానికీ ఒక గుర్తింపు నెంబర్ ఇస్తారు.
13,849 సర్వేయర్ల నియామకం
దేశంలో ఎక్కడాలేని విధంగా చేస్తున్న ఈ సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. రూ.1000 కోట్ల ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టారు.
సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతులకు అందజేయడంతోపాటు క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు.
గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. లంచాలిచ్చే పనిలేకుండా, ఎవరూ మోసపోకుండా ఈ విధానాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు.
0 Comments:
Post a Comment