RBI: ఆర్బీఐ రూ.2000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేసిందా..!
2016, నవంబరు 8న ప్రధాని మోదీ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.2000 నోటు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ నోటు చలామణి క్రమంగా తగ్గిపోతోంది.
ఇప్పుడు ఏటీఎంల నుంచి రూ.2000 నోట్లు చాలా అరుదుగా వస్తున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం ఏమిటంటే, గత 3 సంవత్సరాలలో అంటే 2019-20, 2020-21,2021-22లో రూ. 2000 కొత్త నోట్లను ముద్రించలేద.ఆర్బీఐ ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడైంది.
IANS
IANS దాఖలు చేసిన RTI దరఖాస్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ (P) లిమిటెడ్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2,000 రూపాయల 3,5429.91 కోట్ల నోట్లను ముద్రించిందని తెలిపింది. 2017లో 1115.07 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించినట్లు వివరించింది. 2018-19లో, దానిని మరింత తగ్గించామని., 466.90 కోట్ల నోట్లను మాత్రమే ముద్రించామని పేర్కొంది. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 2,000 డినామినేషన్ కరెన్సీ నోట్ల సంఖ్య '0'గా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్ RTIకి సమాధానం ఇచ్చింది.
నోట్ల రద్దు
పాత రూ. 500, రూ. 1,000 నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016 న రూ. 2,000 నోటును ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం, దేశంలో 2016లో 2,272 రూ.2000 నకిలీ నోట్లను గుర్తించారు. 2018లో వాటి సంఖ్య 54,776కు పెరిగింది. ఈ సంఖ్య 2019లో 90,566గా ఉంది.
0 Comments:
Post a Comment