Rare Vulture | రాబందులు ఒకప్పుడు ఎక్కడ చూసినా విరివిగా కనిపించేవి. ఎక్కడ పశువుల కళేబరాన్ని చూసినా అక్కడ గుంపులు గుంపులుగా వాలిపోయేవి. కానీ
పట్నా: రాబందులు ఒకప్పుడు ఎక్కడ చూసినా విరివిగా కనిపించేవి.
ఎక్కడ పశువుల కళేబరాన్ని చూసినా అక్కడ గుంపులు గుంపులుగా వాలిపోయేవి. కానీ రానురాను కాలక్రమంలో అవి కనుమరుగైపోతూ వచ్చాయి.
ఇప్పుడు అవి కనిపించడం అత్యంత అరుదు. దాంతో వాటిని కనుమరుగైపోతున్న జీవుల జాబితాలో చేర్చారు.
ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన ఓ అరుదైన రాబందు 10 నెలల క్రితం అక్కడి తప్పిపోయింది. రేడియో కాలర్ అమర్చి ఉన్న ఆ రాబందు నేపాల్ పక్షి సంరక్షకుల పర్యవేక్షణ నుంచి మిస్సయ్యింది.
ఇన్నాళ్లు జాడ తెలియకుండా తిరిగిన రాబందు ఇప్పుడు బీహార్‌లో ప్రత్యక్షమైంది. తిండి కోసం తిరిగి అలసిపోయిన ఆ పక్షి పూర్తిగా బలహీనస్థితిలో దొరికింది.
దాంతో దర్భంగాలోని బర్డ్ రింగింగ్ స్టేషన్ అధికారులు ఆహారం అందజేశారు. అనంతరం రేడియో కాలర్ ఆధారంగా నేపాల్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దాంతో బీహార్ అధికారుల ఎఫర్ట్‌కు నేపాల్ అధికారులు అభినందనలు తెలియజేశారు. కాగా, జనాభా వేగంగా తరగిపోవడంతో 2000 సంవత్సరంలో రాబందులను అంతరించిపోతున్న జీవజాతుల్లో చేర్చారు.
0 Comments:
Post a Comment