Pregnant Women: ఆరోగ్యంగా ఉండటానికి అందరు ప్రయత్నిస్తున్నారు. తినే ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. వ్యాయామం చేయడానికి కూడా వెనకాడటం లేదు.
దీంతో ఎన్నో లాభాలున్నాయని అవగాహన రావడంతో అందరు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఒత్తిడిని దూరం చేసుకునే క్రమంలో వ్యాయామం ఎంతో ఉపకరిస్తుంది.
ఈ నేపథ్యంలో గర్భిణులు సైతం వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి గాను వారు సులభమైన పద్ధతుల్లో వ్యాయామం చేస్తే దాని ప్రభావం వారికి అనుకూలంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
Pregnant Women
గర్భధారణ సమయంలో వ్యాయామం చేస్తే వెన్నునొన్పి, అలసట వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. గర్భిణులు వ్యాయామం చేయడం వల్ల గుండె, రక్తనాళాలు బలపడతాయి. మలబద్ధకం సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది.
ఈ సమయంలో వ్యాయామం చేస్తే ప్రెగ్నెన్సీ డయాబెటిస్, ప్రీక్లాంప్సియా, సిజేరియన్ డెలివరీ, వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భిణులు చేయాల్సిన వ్యాయామాల్లో నడక కూడా ఒకటి. గర్భిణులు రోజు నడవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.
గర్భిణులు వారంలో కనీసం 150 నిమిషాలు నడిస్తే ఎంతో మేలు. దీంతో పుట్టబోయే పిల్లల బరువు తక్కువగా ఉండే అవకాశం ఉండదు. ముందుగా డెలివరీ అయ్యే సమస్య ఉండదు. గర్భస్రావం వంటి ప్రమాదాల నుంచి దూరం కావచ్చు.
గర్భధారణ సమయంలో నడవడం, సులభమైన వ్యాయామాలు చేయడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మధుమేహం, ముందస్తు ప్రసవ ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. గర్భధారణ సమయంలో వ్యాయామం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇమ్యూనిటీ శక్తి పెంచుతుంది. పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేయనుంది. అందుకే గర్భిణులు వ్యాయామం చేస్తేనే మంచిది.
Pregnant Women
ప్రసవ సమయం దగ్గర పడుతుంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో వ్యాయామం చేస్తే అలాంటి ప్రమాదం ఉండదు. ఆందోళన తగ్గుతుంది. గర్భిణులు మలబద్ధకం నుంచి బయటపడతారు. జీర్ణక్రియలు మెరుగుపడతాయి. రక్తపోటును నివారిస్తుంది.
వ్యాయామంతో గర్భినులు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే వీలుంటుంది. పుట్టబోయే బిడ్డకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీంతో గర్భిణులు వ్యాయామం చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
0 Comments:
Post a Comment