✍️పాఠశాల విద్యకు ప్రవీణ్ ప్రకాశ్?
♦️రాజశేఖర్ స్థానంలో వచ్చే అవకాశం
♦️నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు
*🌻అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి*):
సీనియర్ ఐఏ ఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్కు పాఠశాల విద్యా శాఖ బాధ్య తలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం పాఠశాల విద్య స్పెషల్ సీఎస్ బి. రాజ శేఖర్ పనిచేస్తున్నారు. ఆయన్ను బదిలీ చేసి ఆ స్థానంలో ప్రవీణ్ను ముఖ్య కార్యదర్శిగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. నేడో రేపో దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా వచ్చే ఏడాది పదవీ విరమణ పొందే రాజశేఖర్ సెలవుపై వెళ్తారనే ప్రచారం సాగుతోంది. లేదంటే మరో శాఖకు ఆయన్ను బదిలీ చేసి కొత్త నియామకం చేపట్టనుంది. సుమారు పది నెలల క్రితం వరకూ సీఎం కార్యాల యంలో ఉన్న ప్రవీణ్ ఓ వెలుగు వెలిగారు. సీఎస్ ను మించిన అపరిమిత అధికారాలతో పెత్తనం చేశారు. చివ రికి ప్రభుత్వం ఆయన్ను భరించలేక ఢిల్లీలోని ఏపీ భవ నక్కు పంపింది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న ఆయన ఇటీవల రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా రాష్ట్రానికి తిరిగొచ్చారు. కాగా రాష్ట్రానికి రాకముందే తనకు పాఠశాల విద్యా శాఖ కావాలని కోరినట్లు తెలి సింది. అప్పటి హామీలో భాగంగానే ఇప్పుడు రాజశేఖర్ స్థానంలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్ప టికే రాజశేఖర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్న ఉపాధ్యాయ సంఘా లకు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిం దని అప్పుడే ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది.
0 Comments:
Post a Comment