Post Office: రూ.10లక్షల బీమా.. ఏటా కేవలం రూ.299 చెల్లిస్తే చాలు!
ఒకప్పుడు ఆరోగ్య, ప్రమాద బీమాలను చాలా తక్కువ మంది మాత్రమే తీసుకునే వారు. కానీ.. కరోనా తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
పేద, మధ్య తరగతి ప్రజలు కూడా ఇన్సూరెన్సులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే Indian Post చౌకగాన ప్రీమియాన్ని తీసుకొచ్చింది. అతి తక్కువ మొత్తంతో రూ.10లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండియన్ పోస్ట్ కొద్ది రోజుల క్రీతం ఏడాదికి రూ.299, రూ.399 ప్రీమియం ప్లాన్‌లతో ఇన్సూరెన్స్ స్కీమ్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్రీమియాల ద్వారా రూ.10లక్షల బీమా పొందొచ్చు. ఉదహరణకు ఒక వ్యక్తి రూ.399తో పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. ఏదైనా ప్రమాదంలో చందాదారుడికి శాశ్వతంగా కానీ పాక్షికంగా గానీ వైకల్యం కలిగినా లేదా శరీర భాగాలు దెబ్బతిన్నా, పక్షవాతం బారిన పడినా రూ.10లక్షల పరిహారం అందుతుంది. ఒకవేళ చందాదారుడు మరణించినా రూ.10లక్షల పరిహారం అతడి కుటుంబ సభ్యులకు అందుతుంది. వీటితోపాటు అంత్యక్రియల కోసం రూ.5వేలు, పిల్లల చదువుల ఖర్చుకు లక్ష రూపాయల పరిహారం అందుతుంది. ఒకవేళ చందాదారుడు ఆసుపత్రి పాలైతే వైద్య ఖర్చుల(ఇన్ పేషెంట్) కోసం రూ.60,000, అవుట్ పేషెంట్‌కు రూ.30వేలు పొందొచ్చు. వీటితో పాటు పేషెంట్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసం రవాణా ఖర్చు కింద దాదాపు రూ.25వేలు లభిస్తాయి. ఇక రూ.299 ప్రీమియం తీసుకున్న వ్యక్తి చందాదారు కూడా రూ.10లక్షల ప్రమాద బీమా పొందొచ్చు. కానీ.. ఆసుపత్రి రవాణా ఖర్చు, అంత్యక్రియలు, పిల్లల చదువుల ఖర్చులు వంటి పరిహారాలు మాత్రం అతడికి వర్తించవు.
0 Comments:
Post a Comment