PF Balance: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకున్నాడు.. రూ.లక్షా 23 వేలు పోగొట్టుకున్నాడు! మీరు ఈ తప్పు చేయకండి...
EPFO News | ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్‌వో (EPFO), పీఎఫ్ అకౌంట్ గురించి తెలిసే ఉంటుంది.
ఎందుకంటే ప్రతి నెలా ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్‌లో (PF Account) జమ అవుతుంది. అలాగే కంపెనీ ఇదే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తుంది. ఇలా ప్రతి నెలా జరుగుతూ వస్తుంది. అందుకే చాలా మందికి పీఎఫ్ గురించి బాగా తెలిసి ఉంటుంది. అయితే పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
47 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. బుక్ కీపర్‌గా ఉన్నారు. అయితే ఈయన పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని, ఈపీఎఫ్‌వో హెల్ప్ లైన్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. ఈయనకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ లభించింది. అయితే ఇది ఫేక్. ఈ విషయం తెలియక ఆయన ఫోన్‌లో వారు చెప్పినట్లు చేశాడు, రిమోట్ యాక్సెస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. దీంతో మోసగాళ్లు ఈయన బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 1.23 లక్షలు కొట్టేశారు.ఏకంగా 14 లావాదేవీలు నిర్వహించారు.
నివేదికల ప్రకారం చూస్తే.. ఈయన ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వెబ్‌సైట్ లోడ్ కాలేదు. దీంతో ఆయన హెల్ప్ లైన్ కోసం గూగుల్ సెర్చ్ చేశాడు. లభించిన నెంబర్‌కు కాల్ చేస్తే మోసగాళ్లు బురిడీ కొట్టించారు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలటే ముందుగా కొంత మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయాలని మోసగాళ్లు చెప్పారు. వారి మాటలు విన్న ఈయన మోసపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అందువల్ల పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు గూగుల్‌లో సెర్చ్ చేయకండి. మీరు ఏమైనా అవసరం ఉందంటే నేరుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. అక్కడి నెంబర్లను మాత్రమే ఉపయోగించండి. లేదంటే ఇలా మోసపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని గుర్తించుకోవాలి.
నేరుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లోకి వెళ్లి యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఇలా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
0 Comments:
Post a Comment