భారతదేశంలో హిందువులు కొన్ని రకాల మొక్కలను పవిత్రమైన మొక్కలుగా భావించడంతోపాటు వాటికీ పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో వేప, తులసి,అరటి, జిల్లేడు వంటి మొక్కలకు పూజలు చేస్తూ ఉంటారు.
అలా హిందువులు పవిత్రంగా భావించి పూజించే మొక్కలలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టుని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. అలా రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు.
రావి చెట్టుకు పూజ చేయాలి అనుకున్న వారు సూర్యోదయం తర్వాత నది స్నానం ఆచరించి కుంకుమచ్చరించి రావి చెట్టును పూజించాలి.
రావి చెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకోవాలి. అలాగే ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్రనామాలను చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అయితే రావి చెట్టును తాకుతూ ప్రదక్షిణలు చేయకుండా ప్రతి ప్రదక్షిణం అనంతరం నమస్కరిస్తూ ప్రదక్షణ చేయాలి.
రావి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసినప్పటికీ ఆదివారం మంగళవారం సంధ్య సమయంలో రావి చెట్టును తాకకూడదు. కేవలం శనివారం రోజు మాత్రమే రావి చెట్టును తకీ పూజ చేసి అనంతరం మనసులో ఉన్న కోరికలను కోరుకోవడం వల్ల తప్పకుండా నెరవేరుతుంది.
పురాణాల ప్రకారం ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానమాచరించి రావి చెట్టుకి నీరు పోసి పూజిస్తే అటువంటి వారిపై శని ప్రభావం ఉండదు.
అలాగే శనివారం రోజు రావి చెట్టుకి పూజించే సమయంలో రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల మరింత మంచి జరుగుతుంది.
రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ చేయడం వల్ల కోరిన కోరికల్ని నెరవేరడంతో పాటు ఆ శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
0 Comments:
Post a Comment