PAN Cards: ఆదాయ పన్ను శాఖ ఇంపార్టెంట్ అలెర్ట్.. అలాంటి పాన్ కార్డులన్నీ ఇకపై రద్దు..!
ప్రస్తుతం బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి పెట్టుబడి పెట్టడం, ఆస్తులు కొనడం, నగలు కొనడం ఇలా అన్నింటికీ ఆధార్ కార్డు (Adhaar Card), పాన్ కార్డు (Pan Card) తప్పనిసరి అయిపోయాయి.
ఈ నేపథ్యంలో పాన్ కార్డును, ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ నిరంతరం కోరుతోంది. ఇప్పటికే ఎన్నో గడువు తేదీలను మార్చింది. ప్రస్తుతం మార్చి 31, 2023 వరకు గడువు ఇచ్చింది. ఇక, ఆ గడువు తేదీని పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఆ లోపు పాన్‌తో ఆధార్‌ని లింక్ చేయకుంటే.. ఆ తర్వాత మీ పాన్‌కార్డ్‌తో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపింది.
మార్చి 31, 2023 తర్వాత గడువు పొడిగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. నిజానికి ఈ ఏడాది జూన్ వరకు పౌరులకు ఆదాయపు పన్ను శాఖ ఉచితంగా పాన్-ఆధార్ లింక్ సౌకర్యం కల్పించింది. జూన్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోపు లింక్ చేసుకునే వారు రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మార్చి తర్వాత పాన్-ఆధార్ లింక్ సాధ్యం కాదు. మీ పాన్‌కార్డు నిరుపయోగంగా మారిపోతుంది.
పాన్-ఆధార్ లింక్ ఎలా?
1) ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2)క్విక్ లింక్స్ విభాగంలో లింక్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి.
3) కొత్త విండో ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీ పాన్‌నంబర్, ఆధార్ నంబర్, ఇతర వివరాలను పూరించాలి.
4)నేను నా ఆధార్ వివరాలను ధృవీకరిస్తాను అనే ఎంపికను ఎంచుకోండి.
5)మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. దానిని నింపి వాలిడేట్ అప్షన్‌పై క్లిక్ చేయాలి.
6)జరిమానా చెల్లించిన తర్వాత మీ పాన్-ఆధార్ లింక్ అవుతుంది.
0 Comments:
Post a Comment