Pan Card: పాన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా..ఆన్లైన్లో అప్లై చేయాల్సిన ప్రాసెస్ ఇదే?
భారతీయులకు ఆధార్ కార్డు ఎంత కీలకమో అదేవిధంగా పాన్ కార్డు కూడా అంతే కీలకము అని చెప్పవచ్చు. భారత్ లో ఉన్న ప్రతి ఒక పౌరుడికి పాన్ కార్డు అన్నది తప్పనిసరి.
ఈ మధ్యకాలంలో అయితే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే సాధారణంగా పాన్ కార్డులలో వివరాలను ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని కారణాలవల్ల కొందరు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. ఆ సమయంలో పాన్ కార్డులో వివరాలను మార్చుకోవాల్సి ఉంటుంది.
కానీ ఆ పాన్ కార్డులో ఎలా అడ్రస్ ను చేంజ్ చేసుకోవాలి అన్నది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ముందుగా మనం ఆన్లైన్లో పాన్ కార్డులో డీటెయిల్స్ ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..పాన్ కార్డులో డీటెయిల్స్ మార్చాలంటే ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html కి వెళ్లాలి.
అప్లికేషన్ టైప్ ఆప్షన్ కింద పాన్‌కార్డులో మార్పులు, అప్‌డేట్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం సంబంధిత వివరాలను ఎంటర్ చేయాలి. చెక్ బాక్స్ పై క్లిక్ చేసి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. పూర్తి చేయడానికి సబ్‌మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఆ తరువాత ఆధార్ కార్డులోని సమాచారం ఆధారంగా చిరునామా అప్‌డేట్ అవుతుంది. ఆ తరువాత మీకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి.
0 Comments:
Post a Comment