NTO 2.0: శుభవార్త.. తగ్గనున్న డీటీహెచ్, కేబుల్ టీవీ బిల్లు, ట్రాయ్ కీలక నిర్ణయం!
DTH | టీవీ ప్రేక్షకులకు శుభవార్త. టెలికం, బ్రాడ్‌కాస్ట్ రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ టారిఫ్ ఆర్డర్ 2.0 (ఎన్‌టీవో)ను సవరించింది.
టెలివిజన్ (TV) ఛానల్స్‌పై ధరల పరిమితిని పెంచింది. ఇదివరకు రూ.12 వరకు ధర కలిగిన ఛానల్స్‌ను (Channels) బొక్వెట్ కిందకు తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని రూ.19కు పెంచింది. అంటే రూ.19 వరకు ధర కలిగిన ఛానల్స్ అన్నీ బొక్వెట్ కిందకు వస్తాయి. దీని కన్నా ఎక్కువ రేటు ఉన్న ఛానల్స్‌ను బ్రాడ్‌కాస్టర్లు ఎంత రేటుకు అయినా సెపరేటుగా అందించొచ్చు.
ఎన్‌టీవో 2.0ను ఆవిష్కరించి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పుడు తొలిసారిగా ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వం 2020 జనవరి నెలలో ఎన్‌టీవో 2.0ను తీసుకువచ్చింది. అప్పుడు బొక్వెట్ ఛానల్స్‌కు రూ. 12 ధర పరిమితిని విధించింది. రూ.12 వరకు ధర కలిగిన ఛానల్స్ అన్నీ బొక్వెట్‌లో భాగమై ఉంటాయి. అయితే ఇప్పుడు ధరల పరిమితిని రూ.19కు చేరింది. అంటే రూ.19 వరకు ధర కలిగిన ఛానల్స్ అన్నీబొక్వెట్‌లో భాగం కావాల్సి ఉంటుంది. ట్రాయ్ తాజా నిర్ణయం వల్ల టీవీ ప్రేక్షకులకు ఊరట కలుగుతుంది.
ఎన్‌టీవో 2.0 తాజా సవరణ నిర్ణయం 2023 ఫిబ్రవరి నుంచి అమలులోకి వస్తుంది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) ప్రెసిడెంట్ కే మాధవన్ మాట్లాడుతూ.. ట్రాయ్ తీసుకువచ్చిన సవరణ సరైనదేని మెచ్చుకున్నారు. అలాగే ట్రాయ్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. బ్రాడ్‌కాస్టర్లు కస్టమర్లకు వాటి బొక్వెట్‌పై 45 శాతం వరకు డిస్కౌంట్స్ అందించొచ్చు. ప్రస్తుతం ఈ డిస్కౌంట్ లిమిట్ 33 శాతమే.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ కొత్త మార్పులు తీసువచ్చినట్లు ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ తీసుకువచ్చిన మార్పుల నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్లు అందరూ వారి పే ఛాన్సల్, బొక్వెట్స్, కంపొజిషన్ ఆఫ్ బొక్వెట్స్ వంటి వాటి ధరలను ట్రాయ్‌కు డిసెంరబ్ 16లోగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే డీటీహెచ్ సంస్థలు, మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు కూడా డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ ప్రైస్ వివరాలను జనవరి 1 కల్లా ట్రాయ్‌కు చెప్పాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ వచ్చే ఏడాది పిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.
రూ.19 పరిమితి ఎందుకు?
ఛానల్స్‌ను బొక్వెట్ లేదా ప్యాక్‌కు యాడ్ చేస్తే.. తక్కువ రేటుకు వస్తుంది. విడివిడిగా ఛానల్స్ అన్నింటినీ కలుపుకుంటే అయ్యే మొత్తం కన్నా ప్యాక్ ధర తక్కువగా ఉంటుంది. అయితే ట్రాయ్ తన ఒక విషయాన్ని గమనించింది. పాపులర్ ఛానల్స్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, మూవీస్ వంటి ఛానల్స్ ధర రూ.12 కన్నా ఎక్కువగా ఉంది. దీని వల్ల సబ్‌స్క్రైబర్లు ఈ ఛానల్స్ కోసం ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తోంది.
2021 నవంబర్ కన్నా ముందు 330 పెయిడ్ ఛానల్స్‌లో 28 శాతం వాటి ధర రూ. 12కు పైన ఉంది. మూడింటి ధర మాత్రమే రూ.19కు పైన ఉంది. అయితే 221 నవంబర్ తర్వాత 353 పెయిడ్ ఛానల్స్‌లో 20 శాతం వాటి ధర మాత్రమేర రూ.12కు పైన ఉంది. 53 వాటి ధర రూ. 19కు పైన ఉంది. అంటే చాలా వాటి ధర రూ.19 పైకి చేరింది. ఇప్పుడు ట్రాయ్ ధర పరిమితి రూ.19కు పెంపు వల్ల చాలావరకు పాపులర్ ఛానల్స్.. తక్కువ ధరకే ఛానల్ ప్యాక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇక్కడ బ్రాడ్‌కాస్టర్లు ఇతర ఛానల్స్ ధరలను పెంచే అవకాశం ఉంటుంది.
0 Comments:
Post a Comment