✍️నో..లీవ్ !
♦️సింగిల్ టీచర్ల స్కూళ్లలో సమస్య
♦️చెతులెత్తేస్తున్న ఎంఈవోలు
*🌻అమరావతి,ఆంధ్రప్రభ*: నూతన విద్యా విధానంలో భాగంగా మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయడంతో ఒకటి, రెండు తర గతులు మాత్రమే ఉన్న పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేలకు పైగా తేలాయి. ఈ స్కూళ్లలో ప్రస్తుతం సింగిల్ టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. వీరికి ఆరోగ్యం బాగోలేకో, ఏదైనా ఫంక్షన్ ఉండో సెలవు పెట్టాలంటే పెద్ద సంకటమైపోతోంది. సాధారణంగా సింగిల్ స్కూల్ టీచర్ ఉన్న పాఠశాలలో ఆ ఉపాధ్యాయులు సెలవు పెడితే వేరే స్కూల్ నుండి ఆ పాఠశాలకు డిప్యూటేషన్ ను వేయాల్సి ఉంటుంది. ఈ పని ఎంఇవో చేయాల్సి ఉంటుంది. కానీ పక్కనున్న స్కూళ్లలో కూడా సింగిల్ టీచర్ మాత్రమే ఉంటున్నారు. మరోవైపు హైస్కూల్ నుండి పంపిద్దామంటే అక్క డనుండి రావడానికి టీచర్లు ఇష్టపడడం లేదు. అదే రోజున తమకు సెలవు కావాలని పట్టుపడుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఎంఇవో చేతులేత్తేస్తున్నారు. నెలకు ఒక్కరోజే సెలవు తీసుకోమని, పలానా స్కూల్ టీచర్ మాత్రమే ఈనెలలో సెలవు తీసుకోవాలని షరతులు పెడుతున్నారు. ఇక ఆరోగ్యం బాగోలేక సెలవు పెడతామంటే ఉపాధ్యాయులకు పెద్ద సంకటమైపోతోంది. అంతే ఏదైనా ఫంక్షన్ ఉండి ఒక వారం రోజులు సెలవు పెడితే ఇక ఆ స్కూల్లో విద్యార్దుల చదువు కుంటుపడుతోంది.
♦️అంగన్వాడీలతో విలీనం చేయాలి
సింగిల్ టీచర్ల సమస్యలు తీరాలంటే మరో టీచరైనైనా ఆ పాఠశాలలో నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే. అగన్వాడీలతో విలీనం చేస్తే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కోరింది. అంగన్వాడీల్లో సిబ్బంది కొరత లేదు. దీంతో ఈ రెండిటినీ విలీనం టీచర్లకు సెలవుల సంకటం తప్పుతుంది. కాగా ఇప్పటికే సింగిల్ టీచర్లపై బోధనేతర పని భారం అధికంగా ఉంది. యాప్ ద్వారా పిల్లల హజరు, బయో మెట్రిక్ నమోదు, మిడ్డే మీల్ పర్యవేక్షణ, ఎంఇవో ఆఫీసు నుంచి పుస్తకాలు, క్వశ్చన్ పేపర్లు తీసుకువారడం లాంటి పనులతో సింగిల్ టీచర్లు బోధించేసమయం తగ్గిపోతోంది. దీంతో ఆ పిల్లల చదువు కుంటుపడుతోంది. అదే అంగన్వాడీలలో విలీనం చేస్తే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నవ శ్రీనివాస్ పేర్కొన్నారు.
![]() |
0 Comments:
Post a Comment