Andhra News: ఇదేం 'నాడు-నేడు': పైన కూల్చివేత.. కింద తరగతులు
భవనంపైన శ్లాబు పగలగొడుతుండగా కింద విద్యార్థులు ప్రమాదకరంగా కూర్చున్న ఈ దృశ్యం గుంటూరు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో శనివారం కనిపించింది.
నగరంలోని స్తంభాలగరవు చేబ్రోలు పుల్లయ్య ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ఒక వైపు తరగతులు జరుగుతుండగా మరోవైపు పై అంతస్తు శ్లాబ్ పగలగొట్టే పనులు చేశారు. కాంక్రీట్ ముక్కలు కింద పడుతున్నాయి. విద్యార్థులపై పడితే పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి పునాదుల కోసం గోతులు తవ్వారు. చిన్నారులు అటూ.. ఇటూ తిరుగుతుండగా ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేకంగా కాపలా ఉండాల్సిన పరిస్థితి ఉంది.
0 Comments:
Post a Comment