Mystery of Myanmar: రహస్యానికి కేరాఫ్ ఈ బంగారు రాయి.. మహిళలు అస్సలు తాకరు.. దీని స్టోరీ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
ప్రపంచంలో వింతలు, విశేషాకు కొదవే లేదు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట అద్భుతం వెలుగులోకి వస్తూనే ఉంటుంది.
చాలా దేశాలలో స్థిరమైన, పురాతనమైన, నిగూఢ రహస్యాను కలిగినే అనేక అవశేషాలు ఉన్నాయి. అలాంటి ఓ చారిత్రక ప్రదేశంలో మయన్మార్‌లోనూ ఉంది. దాని చరిత్ర, దాని ప్రత్యేకంగా అంతా స్పెషలే. ఎన్నో రహస్యాలను తనలో దాచుకుందారాయి. 25 అడుగుల ఎత్తు ఉండే ఈ రాయి కథ వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు 1100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ బంగారు రాయి.. ఒక వైపునకు వంగి ఉంటుంది. ఎలాంటి సపోర్టు లేనట్లుగా ఉండే ఈ రాయి.. ఓవైపు పూర్తిగా వంగి ఉన్నట్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారీ తుపానులు, గాలి దుమారాలు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి దీని సొంతం.
మయన్మార్‌లోని ఈ ప్రత్యేక రాయి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భారీ రాయికి బంగారు వర్ణం పూశారు. దీనిని గోల్డెన్ రాక్, క్యాక్టియో పగోడా అని పిలుస్తారు. స్థానికులు దానికి బంగారు రంగు వేశారు. ఆ కారణంగానే దీనికి గోల్డెన్ రాక్ అని పేరు వచ్చింది. ఈ బంగారు రాయి ఒక వాలు అంచుపై ఉంది. ఏళ్ల తరబడి అలాగే ఉన్నప్పటికీ ఇంచు కూడా కదల్లేదు. ఎవరూ దానిని కదించలేరని కూడా అక్కడి ప్రజల విశ్వాసం. వాలు అంచున దర్జాగా ఉన్న ఈ భారీ ఒక రహస్యం అని చెబుతుంటారు స్థానికులు. అంతేకాదు.. ఈ రాయి బుద్దుడి కేశాలపై ఉందని విశ్వసిస్తారు. 11వ శతాబ్దంలో ఒక బౌద్ధ సన్యాసి దీనిని ఒక వాలుపై నిలిపారని అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకకు అది అక్కడే, అలాగే ఉందన్నారు.
ట్విస్ట్..
అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందండోయ్.. ఈ భారీ రాయిని ఒక స్త్రీ మాత్రమే కదిలించగలదట. ఆ కారణంగానే స్త్రీలు ఆ రాయిని తాకకూడదనే షరతు ఉంది. ఈ రాయిని స్త్రీలు దూరం నుంచి చూసేందుకు మాత్రమే అనుమతి ఉంది. రాయి దగ్గరకు స్త్రీలను రానివ్వరు.
తమిళనాడులోనూ..
మన దేశంలోనూ ఇలాంటి ఒక ప్రత్యేక రాయి ఉంది. తమిళనాడులోని మహాబలిపురంలో చాలా పురాతనమయిన రాయి ఉంది. ఒది ఒక కొండ వాలుపై ఉంటుంది. భారీ తుపానులు వచ్చినా గానీ, అది ఏమాత్రం కదలకుండా ఉంటుంది.
0 Comments:
Post a Comment