అతను ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అతడిని ప్రేమించింది. వారిద్దరూ తమ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ వారి ఆశల పైన విధి నిప్పులుపోసింది.
భవిష్యత్తు కోసం కలలు కంటున్న ఆ అమ్మాయిని కోలుకోలేనంత అనారోగ్యం చుట్టుముట్టింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూసింది.
ఇదంతా ఏ సినిమా కథో కాదు, నిజంగా జరిగిన సంఘటన. దీని గురించి వివరాల్లోకి వెళితే..
అస్సాం రాష్ట్రంలో మోరిగావ్ జిల్లాకు చెందిన బిటుపన్ తములి(27), అదే జిల్లాలో కౌసువ గ్రామానికి చెందిన ప్రాథనా బోరా(24) ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రాథనా బోరా తీవ్ర అస్వస్థతకు గరయ్యి ఆసుపత్రిలో చేరింది. అయితే చికిత్స పొందుతూ మరణించింది.
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలి మరణ వార్త వినేసరికి బిటుపన్ భరించలేక పోయాడు. వెంటనే ఆమె ఇంటికి పరుగులు తీస్తూ వెళ్ళాడు. ప్రాథనా మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు.
అతడు అలా ఏడుస్తుంటే అందరి మనసులూ బరువెక్కాయి. ఆమె ఇక తనతో ఉండదనిచ ఆమెను తప్ప వేరే ఎవరినీ జీవిత భాగస్వామిగా ఊహించుకోలేని బిటుపన్ వెంటనే ఆమె మృతదేహానికి తాళి కట్టి ఆమెను భార్యను చేసుకున్నాడు.
ఇక జీవితాంతం ఆమెనే నా భార్య, ఎట్టి పరిస్థితులలో వేరే ఎవరినీ పెళ్ళి చేసుకోను అని ధృడంగా నిర్ణయించుకున్నాడు.
ఇదంతా చూసిన స్థానికులు, ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు అతడి ప్రేమ చాలా గొప్పదని ప్రశంసిస్తున్నారు.
0 Comments:
Post a Comment