LPG Cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీలు.. వారిపై మరింత భారం!
Commercial Gas Cylinder | ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
వినియోగదారులకు షాకిచ్చాయి. దీంతో సిలిండర్ వాడే వారి జేబుకు చిల్లులు పడనున్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), భారత్ పెట్రోల్ కార్పొరేషన్ (BPCL) ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వాడే వారికి షాకిచ్చాయి. ఫ్యూయెల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై రూ. 200 నుంచి రూ. 300 వరకు డిస్కౌంట్ అందించేవి. అయితే ఇప్పుడు ఈ బెనిఫిట్‌ను తొలిగిస్తున్నట్లు ప్రకటించాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై అధిక డిస్కౌంట్‌ను అందిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లవెత్తాయి. దీంతో కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. డిస్కౌంట్ ఫెసిలిటీని ఎత్తివేసినట్లు వెల్లడించాయి.
కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. నవంబర్ 8 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కొత్త నిబంధన అమలులోకి వచ్చేసింది. అంటే ఇకపై కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారు అధిక డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఇండియన్ ఆయిల్ ప్రకారం చూస్తే.. 19 కేజీలు, 47.5 కేజీలు సిలిండర్లపై ఎలాంటి డిస్కౌంట్ అందుబాటులో లేదు. అలాగే హెచ్‌పీసీఎల్ ప్రకారం చూస్తే.. 19 కేజీలు, 47.5 కేజీలు, 425 కేజీల సిలిండర్లపై అందించే డిస్కౌంట్‌ను తొలగించినట్లు వెల్లడించింది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్నీ ఈ మేరకు డిస్కౌంట్‌ను ఎత్తివేసినట్లు ప్రకటించాయి. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వాడే వారిపై ఎఫెక్ట్ పడనుంది.
మరోవైపు డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను గమనిస్తే.. దీని రేటు రూ.1111 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేటు అమలులో ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ ధర ఏకంగా రూ. 1200 దాటిపోయింది.
కాగా ఇటీవల కాలంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ స్థిరంగానే కొనసాగుతూ వస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఇది గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ సిలిండర్ రేటు రూ. 1111గా లేదు. ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. దిగిరావడం లేదు.
అయితే దేశంలో పలు ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఫ్యూయెల్ రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం రానున్న కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
0 Comments:
Post a Comment