Life certificate - ఇంటి నుంచే జీవిత ధ్రువపత్రం
భారతీయ తపాలాశాఖ ద్వారా ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పిస్తున్న దృశ్యం
పింఛను తీసుకునేవారు నవంబరు నెలలో జీవిత ధ్రువపత్రం సమర్పించాలి..లేకుంటే పింఛను డబ్బులు ఆగిపోతాయి.
దీనికోసం ఏరాష్ట్రంలో ఉన్నా తమ పింఛను డబ్బులు అందించే బ్యాంకుకి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ప్రభుత్వం డిజిటల్ ధ్రువపత్రం ఇవ్వవచ్చని వెసులుబాటు కల్పించినా చాలామందికి దానిగురించి అవగాహనలేదు. భారతీయ తపాలాశాఖ పింఛను దారులకు వారి ఇంటినుంచే రూ.70 నామమాత్రపు రుసుముతో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు రెండేళ్లుగా సేవలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పదవీవిరమణ పొందిన పింఛనుదారులందరికీ ఈ అద్భుతమైన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పేరు, ఆధార్ నంబర్, పింఛను నంబరు ఉంటే చాలు సెల్‌ఫోన్‌కి వచ్చే ఓటీపీ ద్వారా వేలిముద్ర తీసుకుని ఏ రాష్ట్రం వారైనా, ఏప్రాంతం వారైనా దేశంలో ఎక్కడి నుంచైనా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పంపించవచ్చు. కృష్ణా జిల్లా పోరంకి రామాపురం కాలనీకి చెందిన మురాల శ్రీరామమూర్తి(74) పోలియో, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మంచానికే పరిమితమయ్యారు. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఈయన పింఛను కోసం ఇబ్బంది పడేవారు. గత రెండేళ్లుగా పోస్టల్‌శాఖ జీవన్ ప్రమాణ్ తనలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని 'ఈనాడు'తో పంచుకున్నారు.
- ఈనాడు, అమరావతి
0 Comments:
Post a Comment