అదే పనిగా నవ్వుతున్నారంటే మానసిక సమస్య ఉన్నట్టే
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే మాట వినే వింటారు. అందుకని రోజులో ఒకసారైనా గట్టిగా నవ్వితే ఆరోగ్యానికి మంచిది అంటారు డాక్టర్లు.
కానీ, కొందరు ఏ కారణం లేకపోయినా నవ్వుతుంటారు. అంతేకాదు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. ఎంత ప్రయత్నించినా నవ్వకుండా ఉండలేరు. ఇలాంటివాళ్లకు మెదడు పనితీరు సరిగ్గా ఉండదు.
దాంతో వీళ్లకి మానసిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే… అకారణంగా నవ్వడం అనేది మూర్ఛ రోగం లక్షణం అంటున్నారు డాక్టర్లు. ఈ సమస్యని ‘గెలాస్టిక్ ఎపిలెప్సీ’ అంటారు.
దీన్ని యాంటీ సీజర్ మందులతో నయం చేయవచ్చు. ఈ ప్రాబ్లమ్‌ని ముందుగానే గుర్తిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.
హైపోథలామస్‌లో సమస్య
ఈ సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల పిల్లాడికి అపోలో హాస్పిటల్లో న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్నసుధీర్ కుమార్ ఈమధ్యే ట్రీట్మెంట్ చేశారు. ఆ బాబు ఇప్పుడు కోలుకున్నాడు. నవ్వుకి, మూర్ఛకి సంబంధం ఉందనే విషయం గురించి ఇలా చెప్పుకొచ్చారాయన.
ఆ పిల్లడు ఒక నిమిషం పాటు ఆగకుండా నవ్వడం గమనించాను. దాదాపు మూడు నెలలుగా అతను తరచూ నవ్వుతూ ఉండేవాడని తల్లిదండ్రులు చెప్పారు. అతడిని ‘ఎందుకు నవ్వుతున్నావు?’ అని అడిగితే. ‘ఏం లేదు. ఊరికే’ అని సమాధానం చెప్పాడు.
అంతేకాదు అతను ఈ మూడు నెలల్లో 2 కిలోల బరువు పెరిగడమే కాకుండా చదువులోనూ వెనబడ్డాడు. అతని మెదడుని ఎంఆర్ఐ చేశాం.
హైపోథలామస్‌లో ‘హమర్‌టోమా’ అనే సమస్య ఉండడం గమనించాం. ఇలాంటివాళ్లలో హార్మోన్లు సరిగ్గా విడుదల కావు. జ్ఞాపకశక్తి సరిగ్గా పనిచేయదు’ అని చెప్పాడు సుధీర్ కుమార్.
0 Comments:
Post a Comment