Knowledge: కొత్త వాటర్ బాటిల్స్‌లో కనిపించే ఈ ప్యాకెట్స్‌ను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.?
మనం కొత్త వాటర్ బాటిల్స్ కానీ, చెప్పులు కానీ కొనుగోలు చేసిన సమయంలో బాక్స్ విప్పగానే అందులో ప్రొడక్ట్‌తో పాటు కొన్ని ప్యాకెట్స్ కనిపిస్తాయి ఎప్పుడైనా గమనించారు.
సిలికా జెల్ పేరుతో ఉండే ఈ ప్యాకెట్స్‌ను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టిఫిన్ బాక్సుల్లోనూ ఉంచుతారు. వాటిపై ‘డు నాట్ ఈట్’ (తినకూడదు) అని రాసి ఉంటుంది. ఇంతకీ వీటిని ఆ బాక్సుల్లో ఎందుకు ఉంచుతారు.? అసలు వీటివల్ల కలిగే ప్రయోజం ఏంటి.? అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? వీటి వెనకాల ఉన్న అసలు ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్యాకెట్స్‌ను ఓపెన్ చేసి చూస్తే చిన్న చిన్న బాల్స్ ఉంటాయి. వీటిని సిలికా జెల్ అంటారు. వీటిని సిలికాన్ డయాక్సైడ్‌తో తయారు చేస్తారు. ఇది గాలిలో ఉండే తేమను పీల్చుకుంటుంది. సిలికా జెల్‌పై కంటికి కనిపించనంత చిన్న చిన్న రంద్రాలు ఉంటాయి. గాలి తేమలో ఉండే నీటి బిందువులు ఈ రంధ్రంలోకి వచ్చి చేరుతాయి. ఒక్క సిలికా జెల్ అది ఉండే బరువులో 40 శాతం సమానమైన తేమను పీల్చుకుంటుంది. వీటిని ఉపయోగించడానికి ముఖ్య ఉద్దేశం ఇదే.
అయితే వీటిని ఆ బాక్సుల్లో ఎందుకు ఉంచుతారనేగా మీ సందేహం. సాధారణంగా ఎక్కడేతే తేమ ఉంటుందో అక్కడ బ్యాక్టిరీయా తయారయ్యే అవకాశం ఉంటుంది. తేమ వల్ల చెడిపోయే అవకాశం ఉండే వస్తువుల్లో సిలికా జెల్‌ను ఉంచుతారు. గాలిలోని తేమతో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యే అవకాశం ఉంటాయి. అలాగే వాటర్ బాటిల్స్ వంటి వాటిలో తేమ ఉండకుండా వీటిని ఉపయోగిస్తారు. ఇదండీ సిలికా జెల్‌ను ఉపయోగించడం వెనకాల ఉన్న అసలు కారణం.
0 Comments:
Post a Comment