ప్రముఖుల భద్రతకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటాయి. దేశంలో ఉండే పలువురు ప్రజా ప్రనిధితుల కోసం ప్రత్యేక భద్రతా బలగాలతో సెక్యూరిటీ అందిస్తుంటారు.
ఇక దేశ ప్రధాని సెక్యూరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశాన్ని పాలించే ప్రధానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను అందిస్తుంటారు.
అయితే మీరు ఎప్పుడైనా ప్రధాని భద్రతా సిబ్బందిని గమనించారా.? అందులో కొందరు నలుపు రంగులో ఉండే సూట్‌కేస్‌ను పట్టుకొని ఉంటారు.
ప్రధాని నడుస్తున్న సమయంలో అతనితో పాటు కొందరు అధికారులు సూట్‌కేసులతో నడుస్తుంటారు. సహజంగా అయితే ఈ సూట్‌కేస్‌లో ఏవైనా ఆయుధాలు లాంటివి ఉంటాయని భావిస్తుంటాం.
అయితే అందులో ఎలాంటి వస్తువులు ఉండవు. ఆ మాటకొస్తే అసలు అది సూట్‌కేసే కాదు. అనుకోని పరిస్థితులు ఎదరైనా.? ఎవరైనా ప్రధానిపై కాల్పులకు తెగబడ్డా ఈ వస్తువే రక్షణ కల్పిస్తుంది.
సూట్‌కేస్‌ల కనిపించే ఈ వస్తువును ఓపెన్ చేస్తే పెద్ద షీట్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ షీట్.
దీని సహాయంతో ప్రధానిని కానీ మరే ఇతర ప్రముఖులనైనా బుల్లెట్ల నుంచి కాపాడొచ్చు. అంతేకాకుండా ఈ సూట్‌కేస్‌లో ఒక తుపాకీ కూడా ఉంటుంది.
అత్యవసర పరిస్థితిల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. ఇదండీ ప్రముఖుల భద్రతా సిబ్బంది చేతుల్లో కనిపించే సూట్‌కేస్‌ల వెనకాల ఉన్న అసలు ఉపయోగం.
0 Comments:
Post a Comment