అబ్బా.. ఈ మోకాళ్ళ నొప్పిని భరించలేకపోతున్నాను" అనే మాటను వృద్ధులతో పాటు మధ్య వయస్కుల నుంచి మనం తరచుగా వింటుంటాం. గతంలో 60 ఏళ్లు పైబడిన వారికి ఇలాంటి సమస్యలు వస్తుండేవి.
కానీ మారుతున్న జీవనశైలితో పాటు అధిక బరువు, వ్యాయామం కొరవడటం తదితర కారణాల వలన 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పులకు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
హైడెన్సిటీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (HD PRP) ట్రీట్మెంట్ ద్వారా దీర్ఘకాలిక నొప్పులకు చెక్
హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో అత్యాధునిక వైద్యం
FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్
" అబ్బా.. ఈ మోకాళ్ళ నొప్పిని భరించలేకపోతున్నాను" అనే మాటను వృద్ధులతో పాటు మధ్య వయస్కుల నుంచి మనం తరచుగా వింటుంటాం. గతంలో 60 ఏళ్లు పైబడిన వారికి ఇలాంటి సమస్యలు వస్తుండేవి. కానీ మారుతున్న జీవనశైలితో పాటు అధిక బరువు, వ్యాయామం కొరవడటం తదితర కారణాల వలన 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పులకు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇక యువకుల విషయానికి వస్తే.. క్రీడాకారులు ఆటలు ఆడేటప్పుడు తరచుగా మోకాళ్ళ నొప్పుల బారిన పడుతుంటారు.
ఇంత మందిని, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ఈ మోకాళ్ళ నొప్పులను ఆపరేషన్‌తో పని లేకుండా తగ్గించడం సాధ్యం కాదా…? అని అంటే.. సాధ్యమే అని అంటున్నారు. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ స్థాపకులైన డాక్టర్ పి. ఎస్.ఎస్.కిరణ్, డాక్టర్ డి.పల్లవి. ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ళ నొప్పులను తగ్గించే చికిత్స పేరేంటి..? అదెలా చేస్తారు..? దాని వలన రోగికి చేకూరే ప్రయోజనాలు ఏంటి…? తదితర విషయాలను చూద్దాం…!
హై డెన్సిటీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ (HD PRP) అంటే ఏమిటి…?
రోగి యెక్క రక్తాన్ని ఒక స్పెషల్ ట్యూబ్‌లో తీసుకొని … సెంట్రిఫ్యూజ్ మిషన్‌లో ప్రాసెస్ చేసి ప్లేట్ లెట్స్‌ను వేరు చేస్తారు. ఈ ప్లేట్ లెట్స్‌లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్‌ను మోకాళ్లలో ఎక్కడైతే గుజ్జు అరుగుతుందో అక్కడ స్కానింగ్ మిషన్ సహాయంతో ఇంజక్షన్ చేస్తారు.
(HD PRP) ట్రీట్మెంట్ నొప్పిని ఎలా తగ్గిస్తుంది…?
ప్లేట్ లెట్స్‌లోని గ్రౌత్ ఫ్యాక్టర్స్‌కు పునరుత్పత్తి చేసే గుణాలు ఉంటాయి. ఎక్కడైతే గుజ్జు అరుగుదల ఉంటుందో… అక్కడ ఈ (HD PRP) ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కణజాల పునరుత్పత్తి, కణజాల విస్తరణ జరుగుతుంది. అంతేకాకుండా నొప్పి, వాపు తగ్గుముఖం పడతాయి.
ఈ చికిత్స విధానం వలన రోగికి కలిగే లాభాలు ఏంటి..?
అత్యుత్తమ ఫలితాలు అందించే ఈ చికిత్స కేవలం ఒకే ఒక గంట వ్యవధిలో పూర్తవుతుంది. ఈ చికిత్సకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే… రోజుల తరబడి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రెండు గంటల్లోనే రోగిని డిశ్చార్జ్ చేస్తారు. ఈ చికిత్స వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఏ ఏ నొప్పులకు (HD PRP) ట్రీట్మెంట్ తీసుకోవచ్చు…?
మోకాళ్ళ అరుగుదల
(HD PRP) ట్రీట్మెంట్ ద్వారా మోకాళ్ల అరుగుదలలో అత్యద్భుత ఫలితాలు ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడినది. మోకాలి ఆస్టియో ఆర్థోరైటిస్‌లో గుజ్జును పెంచి, నొప్పిని తగ్గించి.. రోగి తన రోజువారి పనులు స్వయంగా చేసుకోగలిగేలా చేస్తుంది.
భుజం నొప్పి
భుజంలో "రొటేటర్ కఫ్" అని పిలవబడే కవచం లాంటి కండరాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కడైనా చిరుగులు ఏర్పడితే (HD PRP) ట్రీట్మెంట్ ద్వారా నయం చేయవచ్చు.
మోచేయి నొప్పి
క్రీడాకారులు తరచుగా "టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్ ఎల్బో" అనబడే మోచేతి కండరాల నొప్పికి గురవుతూ ఉంటారు. ఈ అత్యాధునిక (HD PRP) ట్రీట్మెంట్ ద్వారా ఇటువంటి గాయాలను నయం చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment