Joint Pain Relief : జామ కషాయంతో కీళ్ల నొప్పులే కాకుండా ఈ తీవ్ర వ్యాధులకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు...
Guava For Joint Pain Relief : శీతాకాలం లభించే పండ్లలో జామ పండ్లు ఒకటి. జామకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇది తిపి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది.
అయితే ఇది నోటికి రుచి అందజేయడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. జామపండు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామపండులో ఉండే గుణాలు అందాన్ని పెంచడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. జామపండు తీసుకోవడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జామపండు తినడం వల్ల జీర్ణక్రియ, కఫం వంటి సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. ఈ కాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే ప్రతి రోజూ జామపండు తినడం వల్ల జీర్ణక్రియ, కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి. జామలో యాంటీ బ్యాక్టీరియల్, మరియు యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
జామ ఆకుల ప్రయోజనాలు:
శరీరానికి జామ పండ్లే కాకుండా ఆకులు కూడా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. జామ ఆకులతో చేసిన టీని ప్రతి రోజూ తీసుకుంటే మధుమేహం, కొలెస్ట్రాల్, బరువు సమస్యలు కూడా తగ్గుతాయి.అంతేకాకుండా ఈ ఆకులను పచ్చిగా తీసుకున్న అసిడిటీ, పీరియడ్స్, నోటిపూత, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
ఈ ఆకుల వల్ల శరీరానికి చాలా లాభాలు:
జామ ఆకులు అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు సహాయపడుతుంది. జామ ఆకులను ఉడకబెట్టి, కషాయం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ కషాయం తయారు చేయడానికి ముందుగా 8 నుంచి 10 జామ ఆకులను తీసుకుని 2 కప్పుల నీటిలో వేసి ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత అందులో తేనెను వేసి తాగాలి. ఇలా ప్రతి రోజూ తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జుట్టు, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
0 Comments:
Post a Comment